భీమవరం బుల్లోడితో సెక్సీబ్యూటీ

కామెడీ హీరో సునీల్‌ ప్రస్తుతం దిల్‌రాజు నిర్మాణంలో వాసు వర్మ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే.ఆ సినిమా తుది దశకు చేరుకుంది.

త్వరలోనే విడుదలకు సిద్దం అవుతోంది.ఇక తాజాగా సునీల్‌ మరో సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.

వంశీ ఆకెళ్ళ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో సునీల్‌ హీరోగా నటించేందుకు సిద్దం అవుతున్నాడు.వాసు వర్మ సినిమా పూర్తి కాకుండానే వంశీ సినిమాను ప్రారంభించబోతున్నాడు.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీని దర్శకుడు ఎంపిక చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.సునీల్‌ హీరోగా, వంశీ ఆకెళ్ల దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్‌ సెక్సీ క్వీన్‌ ప్రాచి దేశాయ్‌ను ఎంపిక చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

Advertisement

బాలీవుడ్‌లో సెక్సీ బ్యూటీగా పేరున్న ఈమెకు పెద్ద అక్కడ ఆఫర్లు రావడం లేదు.దాంతో చేసేది లేక సునీల్‌ సరసన తెలుగులో నటించేందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.

తెలుగులో ఈమె మంచి సక్సెస్‌ తెచ్చుకుని, ఇక్కడే జెండా పాతుతుందేమో చూడాలి.ఈ సినిమా త్వరలో సెట్స్‌ పైకి వెళ్లబోతుంది.

Advertisement

తాజా వార్తలు