రాఖీ పండగ వేళ ప్రేమతో చెట్లకు రాఖీలు కట్టిన ప్రకృతి ప్రేమికురాలు బ్లేస్సి

రాజన్న సిరిసిల్ల జిల్లా: రాఖీ పండుగ వేళ ఆ చిన్నారి పర్యావరణహితాన్ని చాటింది.ప్రాణవాయువుని ఇచ్చే చెట్లకు రాఖీలు కట్టి అనుబంధానికి సరికొత్త నిర్వచనం ఇచ్చింది.

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన, ప్రకృతి ప్రకాష్ కూతురు బ్లేస్సి (10) స్వయంగా 100 రాఖీలను పేపర్ తో తయారుచేసి తన ఇంటి ఆవరణంలో తాను నాటిన చెట్లకు రాఖీలనుకట్టింది.గత ఐదు సంవత్సరాలుగా రాఖీలను తయారు చేస్తూ రోడ్డుకు ఇరువైపులా ఉన్న హరితహారంలో నాటిన చెట్లకు సైతం రాఖీలను గతంలో కూడా కట్టింది, రెండు రోజులుగా పేపర్ రాఖీలను తయారుచేసి ఈరోజు 100 రాఖీలను కట్టింది, గతంలోను ఈ చిన్నారి తన తండ్రితో కలిసి రాలిన విత్తలను సేకరించి విత్తన బంతులను చేసి తన తండ్రి సహాయంతో అటవీ ప్రాంతాల్లో వెదజల్లింది.

ఈ సందర్భంగా బ్లేస్సి మాట్లాడుతూ రాఖీలు సోదరులకే పరిమితం కాదని సోదరులతో పాటు మనం పుట్టినప్పటినుంచి చెట్లు తామ ప్రాణవాయువు ఇస్తూ మనం కనుమూసి కాలగర్భంలో కలిసిపోయేంతవరకు కంటికి రెప్పలా కాపాడుతూనే ఉన్నాయని చెట్లే మనకు నూరేళ్లు రక్ష అని రక్షాబంధన్ లో భాగంగా ప్రతి ఒక్కరు చెట్లకు రాఖీలు కట్టాలని కోరింది.నా సొంత సోదరునికి కంటే ముందు చెట్లకే రాఖీలు కట్టినానని వివరించింది.

ప్రమాదకరంగా మారిన రోడ్డుపై గుంత...పట్టించుకోని అధికారులు
Advertisement

Latest Rajanna Sircilla News