బీజేపీ లేచేది లేదు.. కాంగ్రెస్ గెలిచేది లేదు..: మంత్రి హరీశ్ రావు

మహబూబ్ నగర్ జిల్లాలోని కోస్గిలో ప్రగతి నివేదన సభ జరిగింది.ఈ సభలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు ప్రతిపక్షాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

మూడు గంటలు మాత్రమే కరెంట్ ఇస్తే మూడు ఎకరాలు ఎలా పారుతుందని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.మూడు గంటల కరెంట్ కావాలంటే కాంగ్రెస్ కు, 24 గంటల కరెంట్ కావాలంటే బీఆర్ఎస్ కు ఓటేయాలని సూచించారు.

అదేవిధంగా బీజేపీ లేచేది లేదు.కాంగ్రెస్ గెలిచేది లేదన్నారు.

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైలుకు పోవడం ఖాయమని పేర్కొన్నారు.కృష్ణా జలాలు నార్లాపూర్ రిజర్వాయర్ లోకి వచ్చాయని మంత్రి హరీశ్ రావు తెలిపారు.

Advertisement

ఈ క్రమంలో మరోసారి గెలిపిస్తే కృష్ణమ్మ నీళ్లతో ప్రజల పాదాలు కడుగుతామని వెల్లడించారు.

తన కొడుకుతోపాటు మరో యంగ్ హీరోతో మల్టీ స్టారర్ సినిమా చేస్తున్న పూరి జగన్నాధ్...
Advertisement

తాజా వార్తలు