రావాలి రేవంత్ ... కావాలి రేవంత్ ? బీజేపీ ఆశ తీరేనా ?

అసలు బిజెపి ఎప్పుడూ వలసల విషయంపై పెద్దగా దృష్టి పెట్టేది కాదు.

మొదటి నుంచి పార్టీపై అంకితభావంతో ఉన్నవారు, ఆరెస్సెస్ భావజాలం ఉన్న వారు మాత్రమే బిజెపి వైపు వచ్చే వారు .

అటువంటి నాయకులకే ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చేది.అయితే ఇప్పుడు ఆ తరహా రాజకీయాలను నమ్ముకుంటే ఎప్పటికీ దక్షిణాది రాష్ట్రాల్లో బలం పెంచుకో లేము అనే విషయాన్ని గుర్తించిన ఆ పార్టీ పెద్దలు, రెండు తెలుగు రాష్ట్రాల్లో బలపడే విషయం పై దృష్టిపెట్టారు .ముఖ్యంగా తెలంగాణలో ఎన్నికలు జరుగుతుండటతో,  తమ పార్టీ విజయానికి ఎటువంటి డొకా లేకుండా చేసుకునేందుకు బిజెపి అన్ని రకాలుగా ప్రయత్నిస్తూ వస్తోంది.దీనికితోడు ఉపఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు గెలవడంతో , ఇప్పుడు ఎక్కడ లేని ఉత్సాహం కనిపిస్తోంది.

 ఈ క్రమంలోనే టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ లోని కీలక నేతలందరినీ బిజెపి వైపు తీసుకువస్తే, రానున్న రోజుల్లో బిజెపి బలం మరింతగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్

రేవంత్ రెడ్డి

ని బిజెపి లోకి తీసుకురావాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు.

అయినా ఏదో ఒక అవాంతరం వస్తూనే ఆయన చేరిక వాయిదా పడుతూ వస్తున్న ట్లుగా బీజేపీ నేతలు చెబుతుండగా, రేవంత్ మాత్రం కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిగానే వ్యవహరిస్తూ , ఆ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఈ విషయంపై దృష్టి పెడుతూ వస్తున్నారు.ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా గట్టిగానే గళం వినిపిస్తున్నారు.

Bjp Try To Joining On Revanth Reddy, Telangana Congress, Bjp, Revanth Reddy, Ghm
Advertisement
BJP Try To Joining On Revanth Reddy, Telangana Congress, BJP, Revanth Reddy, GHM

 అసలు బిజెపిలోకి వెళ్లే ఆలోచన తనకు లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.అయితే 2014 నుంచి కాంగ్రెస్ వరుస అపజయాలు ఎదుర్కోవడం,  రానున్న రోజుల్లో కూడా బలం పుంజుకునే అవకాశం లేదు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రేవంత్ కు మరో  ఆప్షన్ లేదు.తప్పకుండా బీజేపీలో కే  వస్తారని ఆశలు పెట్టుకుంది.

అది కాకుండా టిఆర్ఎస్ ను మరింతగా దెబ్బ తీయాలంటే రేవంత్ వంటి సమర్థులైన నాయకులు అవసరం ఎంతైనా ఉంది అనే విషయం బిజెపి గుర్తించే, ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు అనేక రకాలుగా రాయబారాలు పంపుతున్నట్లు తెలుస్తోంది.ఆయన బిజెపి లోకి వస్తే,  కీలక పదవి ఇవ్వడంతో పాటు,  రానున్న రోజుల్లో ఆయన ప్రాధాన్యం మరింత పెంచుతామని హామీ ఇస్తూ,  రాయబారాలు పంపు తున్నా,  వేచి చూసే ధోరణిని అవలంబిస్తూ రేవంత్ బిజెపి సహనానికి అగ్ని పరీక్ష పెడుతున్నట్టుగా వ్యవహరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు