కోదాడలో బీజేపీ నిరసన దీక్ష...!

టిఎస్పిఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు సోమవారం కోదాడ పట్టణంలోని రంగా థియేటర్ చౌరస్తా వద్ద బీజేపీ ఆధ్వర్యంలో నిరసన దీక్షను చేపట్టారు.

ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి, లీకేజీలకు నైతిక బాధ్యత వహించలని డిమాండ్ చేశారు.

టిఎస్పిఎస్సిపోటీ పరీక్షలకు ప్రిపేర్ అయిన విద్యార్థులందరికీ లక్ష రూపాయల నష్టరిహారం ఇవ్వాలన్నారు.అసమర్థ ఐటి మంత్రి కేటీఆర్ ను మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలన్నారు.

BJP Protest Started In Kodada, BJP Protest , Kodada , Bandi Sanjay , -కో�

టిఎస్పిఎస్సి పాలక వర్గం ను రద్దు చేసి,చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నియోజక వర్గ బీజేపీ నేతలు,వివిధ మండలాల అధ్యక్షులు, పార్టీ సంఘాల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

నమ్మలేని స్నేహం.. పులిని ప్రేమగా కౌగిలించుకున్న ఎలుగుబంటి.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే?
Advertisement

Latest Latest News - Telugu News