బీజేపీ నేతలకు ఆ విధంగా చిక్కులు తెస్తున్న ఈటల

అసైన్డ్ ల్యాండ్స్ ఆక్రమించారనే ఆరోపణల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్ బయటకు వచ్చిన సంగతి అందరికీ విదితమే.

ఈ క్రమంలోనే శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేయగా, హుజురాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైంది.

హుజురాబాద్ నేతలు, కార్యకర్తలతో సంప్రదింపుల తర్వాత కొద్దిరోజులు మౌనముద్ర దాల్చిన రాజేందర్ ఆ తర్వాత బీజేపీలో చేరారు.ఇక ఉప పోరులో బీజేపీ తరఫున అభ్యర్థిగా ప్రచారంలోకి దిగి ‘ప్రజాదీవెన’ పేరిట పాదయాత్ర చేయడం షురూ చేశారు.

ఇటీవల కాలంలో ఈటల హెల్త్ కండిషన్స్ సరిగా లేక, అస్వస్థతకు గురి కాగా ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు.మోకాలికి డాక్టర్స్ సర్జరీ చేయగా త్వరలో మళ్లీ పాదయాత్ర చేయబోతున్నట్లు ఈటల ప్రకటించారు.

అయితే, బీజేపీ నేతలకు ఈటల ఈ విధంగా చిక్కులు తెస్తున్నారనే రాజకీయ వర్గాల్లో చర్చ ఉంది.అధికార టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈటలపై పార్టీ పరంగా విమర్శలకు ఈ చర్చ స్పేస్ ఇస్తున్నది.

Advertisement

హుజురాబాద్ ప్రజలను కలుసుకునే క్రమంలో ఈటల రాజేందర్ మోడీ ఫొటోను కానీ బీజేపీ ఫొటోను కానీ వాడటం లేదు.అదే ప్రతిపక్ష పార్టీలకు ఆయుధంగా మారుతోంది.

టీఆర్ఎస్ పార్టీ నేత, మంత్రి హరీశ్ ఈటలను మోడీ ఫొటో ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నిస్తున్నారు.ఒకవేళ బీజేపీ ఫొటో పెట్టుకుంటే ఓట్లు రావేమోనని ఈటల భయపడుతున్నారని విమర్శించారు.

మోడీ ఫొటోను చూస్తే జనాలకు పెట్రోల్, డీజిల్ ధరలు గుర్తొస్తాయని, ఫలితంగా ఈటల ఓటమి ఖాయమని కాంగ్రెస్ పార్టీ నేతలూ విమర్శిస్తున్నారు.ఈ క్రమంలో ఇప్పటికైనా విరామం తర్వాత పాదయాత్రలో ఈటల రాజేందర్ బీజేపీ నేతలకు చిక్కులు తొలగించే ప్రయత్నంలో భాగంగా మోడీ ఫొటోను ముందు పెట్టుకుంటారో లేదో చూడాలి మరి.

లక్కీ భాస్కర్ : భిన్నమైన కథే కానీ, అందరి బుర్రకెక్కుతుందో లేదో చూడాలి!
Advertisement

తాజా వార్తలు