GVL Narasimha Rao : విశాఖ అభివృద్ధి..పొత్తులపై బీజేపీ నేత జీవీఎల్ కీలక వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడే కొలది రాజకీయ ముఖచిత్రం రోజురోజుకీ మారిపోతోంది.బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి టీడీపీ చర్చలు జరుపుతోంది.

 Bjp Leader Gvl Narasimha Rao Key Comments On The Development Of Visakha-TeluguStop.com

గతవారం ఢిల్లీలో బీజేపీ పెద్దలు అమిత్ షా( Amit Shah ), జెపీ నడ్డాలతో కూడా సమావేశం కావడం జరిగింది.ఈ క్రమంలో పొత్తులపై ఇంకా స్పష్టత రాలేదు.

పరిస్థితి ఇలా ఉండగా బీజేపీ నేత ఎంపీ జీవీఎల్ ( GVL Narasimha Rao )పొత్తుల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో ఎవరితో పొత్తు పెట్టుకోవాలన్నది అధిష్టానం చూసుకుంటుందని పేర్కొన్నారు.

ఎన్నికలకు ఒంటరిగా వెళ్లాలా లేక కలసి పోటీ చేయాలా అనేది పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు.

ఏపీలో బీజేపీ బలాన్ని ఎలా పెంచుకోవాలని ఆలోచిస్తున్నామని స్పష్టం చేశారు.గ్రామస్థాయిలోకి బీజేపీని మరింత బలోపేతం చేసే రీతిలో ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.దీనిలో భాగంగా బీజేపీ అధిష్టానం పిలుపుమేరకు “పల్లెకు పోదాం” కార్యక్రమంతో గ్రామాల్లోకి వెళ్తున్నట్లు చెప్పుకొచ్చారు.

రాష్ట్ర పార్టీ ఆలోచనలను తాము ఇప్పటికే పార్టీ పెద్దలు దృష్టికి తీసుకెళ్లినట్లు జీవీఎల్ వెల్లడించారు.కాగా విశాఖ అభివృద్ధికి భారీగా నిధులు రాబోతున్నాయని, త్వరలోనే నగరం గ్రోత్ హబ్ గా మారుతుందని వ్యాఖ్యానించారు.

నీతి ఆయోగ్ రోడ్ మ్యాప్ లో వైజాగ్ కు స్థానం లభించిందన్నారు.ఈ నెల 15న సిటీలో నీతి ఆయోగ్ సమావేశం జరగనుందని తెలిపారు.404 సీట్లతో కేంద్రంలో మూడో సారి బీజేపీ ప్రభుత్వమే వస్తుందని జీవీఎల్ జోస్యం చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube