Mahi V Raghav : స్టూడియోకి స్థలం కేటాయింపు.. “యాత్ర 2” డైరెక్టర్ మహి వి.రాఘవ్‌ స్ట్రాంగ్ కౌంటర్..!!

యాత్ర 2( Yatra 2 )దర్శకుడు మహి వి.రాఘవ్‌( Mahi V Raghav ) సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

 Allotment Of Studio Space Yatra Director Mahi V Raghav Strong Counter-TeluguStop.com

హార్సిలిహిల్స్ లో ప్రభుత్వం తనకు రెండు ఎకరాలు కేటాయించిందంటూ ఏపీలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై స్పందించారు.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాయలసీమకు సినిమా ఇండస్ట్రీ ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు.

నా ప్రాంతం కోసమే నా వంతుగా ఏదో ఒకటి చేయాలని ఆశయంతో రెండు ఎకరాల భూమిలోనే మినీ స్టూడియో నిర్మిస్తున్నట్లు స్పష్టం చేశారు.తాను రాయలసీమ మదనపల్లిలో పుట్టి పెరగటం జరిగిందని అన్నారు.

అంతేకాదు అక్కడే చదువుకున్నట్లు చెప్పుకొచ్చారు.సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో రాయలసీమ అంటే షూటింగ్ చేయడానికి ఎవరు పెద్దగా ఆసక్తి చూపించరు.

Telugu Cm Ys Jagan, Jiiva, Mammootty, Rayalaseema, Tollywood, Visakhapatnam, Yat

రాయలసీమ( Rayalaseema ) నేను పుట్టిన ప్రాంతం కేవలం రెండు ఎకరాల్లో మినీ స్టూడియో కట్టాలనుకుంటే నాపై విషం చిమ్మటం అవసరమా అని నిలదీశారు.వాళ్ల ప్రభుత్వంలో వాళ్లకు నచ్చినవారికి ఎవరెవరికో ఎక్కడెక్కడో భూములు ఇచ్చారని, వాటి గురించి ఎవరూ మాట్లాడరని మండిపడ్డారు.నా ప్రాంతానికి ఏదో చేయాలని ఆశయం లేకపోతే.నాకు స్వార్ధం ఉంటే…నేను హైదరాబాద్ లేదా వైజాగ్ లో స్టూడియో కట్టుకోవడానికి స్థలం కావాలని అడిగేవాడిని కదా అంటూ మహి వ్యాఖ్యానించారు.

సినిమా ఇండస్ట్రీలో 16 సంవత్సరాల నుండి రాణిస్తున్న.మూన్ వాటర్ పిక్చర్స్, 3 ఆటం లీవ్స్ అనే రెండు నిర్మాణ సంస్థలను స్థాపించా.తాను తీసిన అనేక సినిమాలు రాయలసీమలోనే చిత్రీకరించినట్లు స్పష్టం చేశారు.మహి వి.రాఘవ్‌ దర్శకత్వం వహించిన యాత్ర, యాత్ర 2 సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.ఈ క్రమంలో రాయలసీమలో మినీ స్టూడియో నిర్మించడానికి రెడీ అవుతున్న క్రమంలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా దుష్ప్రచారాలపై లేటెస్ట్ ఇంటర్వ్యూలో తనదైన శైలిలో మహి ఖండించడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube