దేశం మొత్తానికి విస్తరించి రెండు సార్లు కేంద్రం లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినా కూడా బారతీయ జనతాపార్టీ కి( BJP ) కొరకరాని కోయ్య గా మిగిలిన రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి.అందులో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు కూడా ఉంది.
తెలంగాణ లో కూడా మెల్లగా పాగా వేయగలిగింది గాని దశాబ్దాలుగా ఎంత ప్రయత్నించినా కూడా తమిళనాడులో బిజెపి బలం పుంజుకోలేకపోతుంది .ఇక్కడ రాజకీయం అంతా ప్రధాన ప్రాంతీయ పార్టీలైన డిఎంకె – ఎడిఎంకే మధ్య ఉంటుంది.

ఒకసారి ఒక పక్షానికి మరొకసారి ఇంకొక పక్షానికి అధికారం ఇచ్చే తమిళ సోదరులు జాతీయ పార్టీలకు మాత్రం ఎక్కడ నో ఎంట్రీ బోర్డు పెడుతుంటారు .దాంతో ఈ ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ బిజెపి ఇంతకాలం నెట్టుకొచ్చాయి .అయితే అన్నా డిఎంకే అదినేత్రి జయలలిత( Jayalalitha ) మరణంతో తమిళనాడులో రాజకీయ శూన్యత ఏర్పడిందని భావించిన బిజెపి అన్నా డీఎంకే పార్టీని ముక్కలు చేసి తమ గ్రిప్ లో పెట్టుకోంది .ఎదురు తిరిగిన జయలలిత సహచరి శశికళ ను అవినీతి ఆరోపణల తో జైలు పాలు చేసింది.దాంతో డీఎంకేకి( DMK ) ఆల్టర్నేటివ్ ఫోర్స్ గా ఎదగాలని తమిళనాడులో బిజెపి జెండా పాతాలని బలంగా ప్రయత్నాలు చేస్తుంది.

దానికి అనుగుణంగానే ఆ పార్టీ తమిళనాడు బిజెపి చీఫ్ ఇటీవల డీఎంకే పై భారీ ఎత్తున ఫోకస్ పెట్టి ఆ పార్టీలోని అవినీతిపరులను మీడియాకు రిలీజ్ చేస్తున్నారు.ఈయన ఇలా లిస్ట్ రిలీస్ చేయగానే ఆయా నేతలపై ఈడీ , సిబిఐ దాడులు జరుగుతున్నాయి .ఇప్పటికే ఆరోగ్య శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ ని( Minister Senthil Balaji ) అరెస్ట్ చేసిన ఈడి మరిన్ని అరెస్టు దిశలుగా సిద్ధమవుతుందని ముఖ్యంగా అవినీతి ఆరోపణలతో స్టాలిన్ కుటుంబాన్ని బిజెపి టార్గెట్ చేసిందని, వచ్చే ఎన్నికల్లో అక్కడ ఉన్న 39 ఎంపీ స్థానాలలో మెజారిటీని గెలుచుకునే విధంగా ప్రజల్లో డిఎంకే పై వ్యతిరేకత వచ్చే విధంగా బిజెపిగా పావులు కదుపుతుందని తెలుస్తుంది.ఎలానో అన్నాడిఎంకే మద్దతు ఉంది కాబట్టి స్టాలిన్ వర్గాన్ని బలహీనపరిస్తే తమ లక్ష్యాన్ని చేరవచ్చును భావిస్తున్న బిజెపి స్పీడ్ పెంచింది .మరి బిజేపి ప్రయత్నాలని తమిళ వోటర్ల ఏమేరకు నమ్ముతారో , బిజేపి కి అవకాశం ఇస్తారో లేదో చూడాలి .