సాగర్ లో ఆశల్లేవ్ తిరుపతే దిక్కు ! బీజేపీ కథ అడ్డం తిరిగిందే ? 

రెండు రాష్ట్రాల్లో బిజెపికి ఇది ఒక పరీక్షా కాలమే.తెలంగాణ, ఏపీ లలో చాలా కాలం నుంచి బలపడాలని బిజెపి చూస్తోంది.

తెలంగాణలో పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో తప్పకుండా టిఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని, కాంగ్రెస్ బలహీనంగా ఉండడంతో బిజెపి వైపు జనాలు చూస్తారు అని, బిజెపి తప్పకుండా అధికారంలోకి వస్తుందని నమ్ముతూ వచ్చారు.దీనికి తగ్గట్టుగానే దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీకి విజయం దక్కడం, జిహెచ్ఎంసి ఎన్నికలలోనూ బీజేపీ ప్రభావం స్పష్టంగా కనిపించడం తో తిరుగే లేదన్నట్లుగా తెలంగాణ బిజెపి నాయకులు భావిస్తూ వస్తున్నారు.

కానీ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఇప్పుడు బాగా ప్రభావాన్ని చూపిస్తున్నాయట.పెట్రోల్, గ్యాస్ ,డీజిల్ పెంపుతో పాటు అనేక ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం, భారీగా ధరల పెరుగుదల, నిరుద్యోగం ఇలా ఎన్నో అంశాలతో దేశవ్యాప్తంగా బిజెపి వ్యతిరేకత ఎదుర్కొంటోంది.

ఇప్పుడు ఆ ప్రభావం తెలంగాణలో జరుగుతున్న నాగార్జునసాగర్ నియోజకవర్గం పై స్పష్టంగా కనిపిస్తోంది.దీనికి తోడు అక్కడ బీజేపీ అభ్యర్థిగా నిలబెట్టిన డాక్టర్ రవి కుమార్ కు రాజకీయ అనుభవం లేకపోవడం, కాంగ్రెస్ నుంచి రాజకీయ ఉద్దండుడు గా ఉన్న జానారెడ్డి కి ఈ నియోజకవర్గంపై పూర్తిగా పట్టు ఉండడం, ఇక టిఆర్ఎస్ నుంచి దివంగత ఎమ్మెల్యే నోముల నరసింహ కుమారుడు భగత్ కావడంతో పోటీ అంతా ఇప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య నెలకొనడం తో ముందుగానే ఈ విషయాన్ని గ్రహించిన బీజేపీ సాగర్ ఎన్నికలపై ఫోకస్ తగ్గించి , పూర్తిగా తిరుపతి పై దృష్టిసారించినట్లు వ్యవహరిస్తోంది.

Advertisement

జనసేన బలంగా ఉండడం తో తిరుపతి లో తప్పనిసరిగా గెలుస్తాం అనే ధీమాలో లో ఉన్న బిజెపి సాగర్ ఎన్నికలను లైట్ తీసుకుని , ఫోకస్ అంతా తిరుపతి పైనే పెట్టిందట.

  తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయం పాలైనప్పటి నుంచి బిజెపి నాయకులు , కార్యకర్తల్లో నిరాస అలుముకోడంతో అటు నాగార్జునసాగర్ లో తమకు గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయి అనే రిపోర్ట్స్ రావడంతోనే, బిజెపి ఫోకస్ ఇక్కడ తగ్గి తిరుపతి లో పెరిగినట్లు కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు