ఏపీలో విచిత్ర రాజకీయ పరిస్థితి కనిపిస్తోంది.అధికార పార్టీ వైసీపీని మళ్లీ అధికారంలోకి రాకుండా చేసేందుకు విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి.ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు విపక్ష పార్టీలు అన్నిటినీ ఏకం చేసే పనిలో నిమగ్నం అయ్యారు.2024 ఎన్నికల్లో టిడిపి ఒంటరిగా పోటీ చేస్తే మళ్ళీ 2019 ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయనే భయం చంద్రబాబులో ఎక్కువగా కనిపిస్తోంది.అందుకే విపక్ష పార్టీలన్నిటిని ఏకం చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.ఇదిలా ఉంటే టిడిపి, జనసేన పార్టీలు విడివిడిగానే 2019 నుంచి వైసీపీని టార్గెట్ చేసుకుంటూ పోరాటాలు చేస్తున్నాయి.
ఎన్నికల సమయంలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదురుతుందని అంతా అంచనా వేస్తూనే వచ్చారు.దీనికి తగ్గట్టుగానే ఇటీవల విశాఖలో పవన్ ను పోలీసులు జనవాణి కార్యక్రమంలో పాల్గొనేందుకు అనుమతించకుండా వెనక్కి పంపడం, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల మధ్య పవన్ ను చంద్రబాబు పరామర్శించడం వంటి వ్యవహారాలు చోటు చేసుకున్నాయి.
దీంతో టీడీపీ , జనసేన ల పొత్తు కాయమని అంతా అంచనాకు వచ్చారు.దీనికి తగ్గట్లుగానే పవన్ సైతం వైసీపీని ఓడించేందుకు పొత్తులకు సిద్ధమైనట్లుగా సంకేతాలు ఇచ్చారు.
అయితే ఈ పరిణామాలు బిజెపికి ఆగ్రహాన్ని కలిగించినా… ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ ను దూరం చేసుకుంటే ఏపీలో బీజేపీ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంటుందనే భయం వెంటాడుతోంది.

దీనికి తగ్గట్టు గానే పవన్ సైతం బిజెపిని రూట్ మ్యాప్ అడిగానని, కానీ ఆ పార్టీ స్పందించలేదంటూ మాట్లాడారు.దీంతో అప్రమత్తమైన బిజెపి 2024 ఎన్నికల్లో టిడిపి జనసేనలు మాత్రమే కలిసి పోటీ చేస్తాయంటూ టిడిపిని దూరం పెట్టి ప్రయత్నం చేశారు.ఈ మేరకు ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి సునీల్ దియోదర్ ఈ ప్రకటన చేశారు.
అసలు జనసేన ను టిడిపికి దగ్గర కాకుండా చూడడమే లక్ష్యంగా బిజెపి పావులు కదుపుతోంది.అయితే పవన్ మాత్రం టిడిపి తో కలిసి వెళ్తేనే వైసిపిని అధికారానికి దూరం చేయవచ్చని, బిజెపితో తమ పార్టీ ఉన్నా… తమ రెండు పార్టీల బలం అంతంత మాత్రంగానే ఉంటుందనే విషయాన్ని గుర్తించారు.
అందుకే బిజెపి తమ పార్టీతో పొత్తును కొనసాగించే విధంగానే మాట్లాడుతూ మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నా.పవన్ మాత్రం టీడీపీకి దగ్గర అయ్యే విధంగానే ప్రయత్నాలు చేస్తున్నారు.