కీర్తి సురేష్ పెళ్లి నిజంగా ఫిక్స్ అయ్యిందా.. వరుస సినిమాలు ప్లాప్ కావడం వల్లే?

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మహానటి సినిమాతో భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని ఏర్పరచుకుంది కీర్తి సురేష్.

 Reports Next Year First Quarter Keerthy Suresh Marriage, Keerthy Suresh, Tollywo-TeluguStop.com

ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో కీర్తి సురేష్ కి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అదేమిటంటే.

త్వరలో కీర్తి సురేష్ పెళ్లి పీటలు ఎక్కనుందా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఆమె ఇదివరకు చెప్పిన విధంగానే తన మనసుకి నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ఆమె సిద్ధంగా ఉందట.

ఇదే విషయాన్ని కీర్తి సురేష్ తల్లి మేనక తాజాగా ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపినట్లు సమాచారం.ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో సమంత,కాజల్,ప్రణతి ఇలాంటి హీరోయిన్ పెళ్లిళ్లు చేసుకున్న సెటిల్ అయిన విషయం తెలిసిందే.

ఆ విధంగా కీర్తి సురేష్ కూడా పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతోంది అంటూ జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.వచ్చే ఏడాది ప్రధమార్థంలో కీర్తి పెళ్ళి పీటలెక్కబోతోందట.

వరుడు కీర్తి సురేష్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ఓ యువ పారిశ్రామికవేత్తతో ఆమె పెళ్లి జరగనుందట.

Telugu Keerthy Suresh, Menaka, Tollywood-Movie

అయితే అతను ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.ఇది ఇలా ఉంటే కొందరు కీర్తి సురేష్ విషయంలో వినిపిస్తున్నవన్ని రూమర్సే అని కొట్టి పడేస్తున్నారు.అంతేకాకుండా కీర్తి సురేష్ ఫోకస్ మొత్తం సినిమాలపై ఉందని వారి కుటుంబంలో కూడా ఆమె పెళ్లి విషయంపై చర్చలు జరగలేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

 కొందరు ఈ వార్తలపై స్పందిస్తూ కీర్తి సురేష్ నటించిన సినిమాలు అన్ని వరుసగా ప్లాప్ అవడం వల్లే ఈ విధంగా పెళ్లి చేసుకోవాలనే నిర్ణయించుకుంది అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు.మరి ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాలి అంటే కీర్తి సురేష్ స్పందించే వరకు వేసి చూడాల్సిందే మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube