అందుకే విడిపోయాం అంటూ ఫస్ట్ రిలేషన్ గురించి చెప్పిన బిందు మాధవి..?

బిగ్ బాస్ నాన్ స్టాప్ కంటెస్టెంట్ లలో చూడ్డానికి కాస్త పద్దతిగా, సైలెంట్ గాకనిపిస్తూ ఉంటుంది కంటెస్టెంట్ బిందు మాధవి.

ఇక సినిమాల ద్వారా బిందుమాధవి మనందరికీ సుపరిచితమే.

సినిమాలను కూడా ఆమె ఎంత సింపుల్ గా కనిపిస్తూ ఉంటుంది.అంతే కాకుండా ఆమె నటించిన సినిమాలు కూడా అంతే సింపుల్ గా ఉంటాయి.

మదనపల్లి కి చెందిన బిందు మాధవి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలోకి ఎంట్రీ కూడా ఇచ్చింది.

అయితే తెలుగు హీరోయిన్ అయినప్పటికీ ఈమె తమిళంలోనే ఎక్కువగా సినిమా ఆఫర్లు వచ్చాయి.ఈమె తెలుగు సినిమాల్లో ఎక్కువగా నటించలేదు.

Advertisement

ఇకపోతే ఈమె తెలుగువారికి దగ్గరవ్వాలి అన్న ఉద్దేశంతో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాను అని తెలిపింది బిందుమాధవి.అయితే బిందు మాధవి ఇంతకుముందే తమిళ బిగ్ బాస్ షోలో పాల్గొంది.

బ్రేకప్ అయిన సమయంలో తనకు తమిళ బిగ్ బాస్ నుంచి ఆఫర్ వచ్చిందని బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లి వచ్చిన తర్వాత కాస్త కోలుకున్నాను అంటూ బిందుమాధవి తెలిపింది.ఇదిలా ఉంటే తాజాగా బిగ్ బాస్ లో తాజాగా జరిగిన ఎపిసోడ్ బిందుమాధవి తన పర్సనల్ విషయాల గురించి బయట పెట్టింది.

టాస్క్ లో భాగంగా బిందు మాధవికి తన రిలేషన్ గురించి చెప్పాల్సి రాగా కాలేజ్ టైంలో ప్రేమించుకున్నామని, అయితే కెరీర్ కోసం దూరమవ్వాల్సి వచ్చిందని, అతను చదువుల కోసం యూఎస్ వెళ్లిపోయాడని, తాను ఇలా సినీ రంగంలోకి వచ్చేశాను అని తెలిపింది.కానీ ఆ రిలేషన్ మాత్రం తనకు ఎప్పటికీ స్పెషల్ అంటూ చెప్పుకొచ్చింది.అతని పేరుని మాత్రం చెప్పలేను.

ఇప్పుడు అతడికి పెళ్లి అయిపోయిందంటూ బిందు మాధవి తెలిపింది.

రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 
Advertisement

తాజా వార్తలు