SSMB28 Ponniyin Selvan 2 : మహేష్ మూవీకి పోటీగా మరో భారీ బడ్జెట్ సినిమా.. క్లాష్ తప్పదా?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మధ్యనే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా స్టార్ట్ చేసాడు.

సర్కారు వారి పాట తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.త్రివిక్రమ్ సినిమా అంటేనే ముందుగానే సూపర్ హిట్ అని చెప్పేస్తారు.

ఇక అందుకే సూపర్ స్టార్ తో త్రివిక్రమ్ కలిసాడు కాబట్టి ఇంకా అంచనాలు పెరిగాయి.ఇప్పటికే వీరిద్దరి కాంబోలో రెండు సినిమాలు వచ్చాయి.

అతడు, ఖలేజా రెండు కూడా మహేష్ లోని కొత్త కోణాన్ని చూపించాయి.ఇక ఇప్పుడు ముచ్చటగా మూడవ సారి ఈ కాంబో రాబోతుంది.SSMB28 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవలే రెగ్యురల్ షూట్ స్టార్ట్ అయ్యింది.ఫస్ట్ షెడ్యూల్ లోనే యాక్షన్ సన్నివేశాలతో త్రివిక్రమ్ ఈ సినిమాను స్టార్ట్ చేసాడు.

Advertisement
Biggest Kollywood Film To Clash With SSMB28, SSMB28 , Pooja Hegde, Mahesh Babu,

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం త్రివిక్రమ్ పక్కా ప్లాన్ తో బరిలోకి దిగాడు.రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో షూటింగ్ జరుపుకుంది.

ఒక యాక్షన్ సీక్వెన్స్ ను ఇప్పటికే పూర్తి చేసారు.సెకండ్ షెడ్యూల్ రెండు మూడు రోజులు గ్యాప్ ఇచ్చి స్టార్ట్ చేయాలని అనుకున్నాడు.

కానీ కొన్ని కారణాల వల్ల ఈ షెడ్యూల్ ఆగిపోయింది.ఇక ఈ మూవీలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.

హారిక హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

రక్తపు మరకల దుస్తులతోనే తండ్రికి కూతురు అంత్యక్రియలు.. వీడియో చూస్తే కన్నీళ్లాగవు..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటలు విని ఎంతో సంతోషించాను.. నాగచైతన్య కామెంట్స్ వైరల్!

అయితే ఇప్పుడు మహేష్ రాబోతున్న డేట్ లోనే మరో భారీ బడ్జెట్ సినిమా రాబోతుంది అని టాక్ వస్తుంది.

Biggest Kollywood Film To Clash With Ssmb28, Ssmb28 , Pooja Hegde, Mahesh Babu,
Advertisement

పొన్నియన్ సెల్వన్ 1 రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే.మావెరిక్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమా రెండవ పార్ట్ కూడా రాబోతుంది.అయితే పార్ట్ 2 సినిమాను 2023 సమ్మర్ లోనే ఏప్రిల్ 28న గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.

ఇదే జరిగితే బిగ్ క్లాష్ తప్పదు.మహేష్ కు కూడా తమిళ్ లో థియేటర్స్ ప్రాబ్లెమ్ అవ్వవచ్చు.మరి ఆ సమయానికి రిలీజ్ డేట్స్ మారుతాయో లేదో చూడాలి.

తాజా వార్తలు