బిగ్ బాస్ కాల్ ఫర్ శేఖర్ మాస్టర్..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ ఇలా ముగిసిందో లేదో బిగ్ బాస్ సీజన్ 6కి రంగం సిద్ధం చేస్తున్నారని తెలుస్తుంది.

త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 6 మొదలవబోతుంది.

ఈసారి క్రేజీ సెలబ్రిటీస్ తో బిగ్ బాస్ సీజన్ 6 ఉంటుందని తెలుస్తుంది.ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 6 కు సంబందించిన కంటెస్టంట్స్ లిస్ట్ ఒకటి ఇప్పటికే సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.

వారిలో ప్రముఖ స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ పేరు కూడా ఉందని తెలుస్తుంది.కొరియోగ్రాఫర్ గా ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ ఫాం లో ఉన్న శేఖర్ మాస్టర్ స్టార్ హీరోల నుంచి యువ హీరోల సినిమాల దాకా డ్యాన్స్ కంపోజ్ చేస్తున్నాడు.

ఈటీవీ డ్యాన్స్ షో నుంచి స్టార్ మా కామెడీ స్టార్స్ కి వచ్చిన శేఖర్ మాస్టర్ తన నెక్స్ట్ టార్గెట్ బిగ్ బాస్ అని తెలుస్తుంది.ఆల్రెడీ అంతకుముందు సీజన్ లలో శేఖర్ మాస్టర్ ని అడిగినా అతను ఎందుకో పాల్గొనలేకపోయాడట.

Advertisement

ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 6లో శేఖర్ మాస్టర్ దాదాపు ఫిక్స్ అని అంటున్నారు.ప్రతి సీజన్ లో ఎవరో ఒక డ్యాన్స్ మాస్టర్ ని హౌజ్ లోకి పంపిస్తారు.

ఈసారి సీజన్ 6 కోసం శేఖర్ మాస్టర్ వస్తారని తెలుస్తుంది.మరి బిగ్ బాస్ సీజన్ 6 ఆశించిన స్థాయిలో ఉంటుందా లేదా అన్నది చూడాలి.

Advertisement

తాజా వార్తలు