అర్జున్ అమర్ తో అలా ప్రవర్తిస్తాడని అనుకోలేదు అంటూ తేజస్విని షాకింగ్ రియాక్షన్!

ఈ సీజన్ బిగ్ బాస్( Bigg Boss ) రియాలిటీ ఎంత రసపట్టుగా సాగుతూ ముందుకు దూసుకెళ్ళిందో మనమంతా చూస్తూనే ఉన్నాం.

నిన్న గాక మొన్న ప్రారంభం అయ్యినట్టుగా అనిపించిన ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో అప్పుడే 13 వారాలు పూర్తి చేసుకుంది.

అయితే ఈ సీజన్ జనాలకు ఎంటర్టైన్మెంట్ ని అందించే విషయం లో కానీ, టీఆర్ఫీ రేటింగ్స్ విషయం లో కానీ ది బెస్ట్ అని చెప్పొచ్చు.రెవిన్యూ పరంగా కూడా ఇప్పటి వరకు ప్రసారమైన అన్నీ సీజన్స్ కంటే ది హైయెస్ట్ గా ఉందట.

అయితే ఈ సీజన్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లో అద్భుతంగా ఆడుతూ నేడు టికెట్ టు ఫినాలే( Ticket To Finale ) గెలుచుకొని, మొట్టమొదటి ఫైనలిస్ట్ గా అడుగుపెట్టిన కంటెస్టెంట్ అర్జున్ అంబటి.( Arjun Ambati ) టికెట్ టు ఫినాలే టాస్కు లో అర్జున్ తన విశ్వరూపం చూపించాడనే చెప్పాలి.

మిగిలిన అందరూ హౌస్ మేట్స్ గేమ్ నుండి తొలగిపోయిన కంటెస్టెంట్స్ నుండి పాయింట్స్ ని అందుకొని రేస్ లో ముందుకు సాగారు.కానీ అర్జున్ మాత్రం ఒక్కటంటే ఒక్క పాయింట్ ని కూడా ఇతరుల నుండి అడగకుండా, తన సొంతం గా ఆడి గెలుచుకున్నాడు.ఇందుకు ప్రతీ ఒక్కరు ఆయన్ని శబాష్ అని సోషల్ మీడియా లో మెచ్చుకున్నారు కూడా.

Advertisement

టాస్కుల పరంగా అర్జున్ కి ఇసుమంత వంకలు కూడా పెట్టలేము కానీ, అతను చాలా కన్నింగ్ మనిషి అనేది మాత్రం సోషల్ మీడియాలో బాగా ప్రచారం అయ్యింది.ఎందుకంటే హౌస్ లోకి అడుగుపెట్టిన కొద్ది రోజులకు ఈ అమర్ దీప్( Amardeep ) గాడిని ఎంత తప్పించుకుందాం అనుకున్నా అన్నా అన్నా అని వెంటపడుతున్నారు ఇందిరా అని టేస్టీ తేజా తో అంటాడు.

బయట అర్జున్ మరియు అమర్ ఎంత మంచి స్నేహితులు అనే విషయం మన అందరికీ తెలిసిందే, కానీ హౌస్ లో అలా ఉండకపోవడం తో అర్జున్ కి అక్కడి నుండి నెగటివిటీ మొదలైంది.

అయితే ఇదే విషయాన్నీ అమర్ దీప్ భార్య తేజస్విని ని( Tejaswini ) రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో అడగగా ఆ వీడియో చూసి నేను కూడా చాలా బాధపడ్డాను, ఎందుకు అర్జున్ అలా మాట్లాడాడో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు.గేమ్ స్ట్రాటజీ అయితే నేను అర్థం చేసుకోగలను, కానీ నిజంగానే అతనిని దూరం పెట్టి ఉంటే మాత్రం చాలా ఫీల్ అవుతాను, అతను హౌస్ నుండి బయటకి రాగానే ఈ విషయం అడగాలని అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది తేజస్విని.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023
Advertisement

తాజా వార్తలు