యానీ మాస్టర్ కు పెద్ద బాధ్యత అప్పజెప్పిన రామ్ చరణ్..?

మెగా కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని ఇంట్లో పెళ్లి సందడి మొదలయ్యింది.ఉపాసన చెల్లెలు అనుష్పాల పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

ఈ సెలబ్రేషన్స్ లో హీరో రామ్ చరణ్ మెరుస్తూ ఆ వివాహ వేడుకలను దగ్గరుండి చూసుకుంటున్నాడు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలను బట్టి చూస్తే ఈ పెళ్లి వేడుకలు ఒక రేంజ్ లో జరుగుతున్నాయని అర్థమవుతోంది.

అయితే మరదలి సంగీత్ సెలబ్రేషన్స్ బాధ్యతను చెర్రీ బిగ్ బాస్ కంటెస్టెంట్ అనీ మాస్టర్ కు అప్పగించినట్లు తెలుస్తోంది.దీనితో అంత పెద్ద ఈవెంట్ ను తనకు అప్పగించడంతో అనీ మాస్టర్ ఆనందం వ్యక్తం చేస్తోంది.

ఈ వివాహ వేడుకలలో డాన్స్ చేయడం కోసం రెండు రోజుల నుంచి అనీ మాస్టర్ తన టీమ్ తో డ్యాన్స్ ప్రాక్టీస్ చేయిస్తోంది.ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది.

Advertisement

అయితే ఇంత పెద్ద ఈవెంట్ ను తనకు అప్పగించిన రామ్ చరణ్ కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పింది అనీ మాస్టర్.

15 ఏళ్లుగా మీరు నాపై నమ్మకం ఉంచుతూ వస్తున్నారు అంటూ చెర్రీతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది అనీ మాస్టర్.ఇక ఈ సంగీత్ సెలబ్రేషన్స్ దోమకొండ కోటలో జరుగుతున్నట్లు తెలుస్తోంది.ఇకపోతే అనీ మాస్టర్ బిగ్ బాస్ ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకుంది.

సొంత ఇంటిని నిర్మించుకోవాలి అన్న ఆశతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన ఆమెకు బిగ్ బాస్ నిర్వాహకులు మంచి పారితోషికం అందించారు.హౌస్ నుంచి రాగానే రామ్ చరణ్ పిలిచి మరీ ఈవెంట్ అప్పగించడంతో అనీ మాస్టర్ ఆనందంతో ఉబ్బితబ్బిబవుతోంది.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు