Bigg Boss Sohel : యూట్యూబర్ పూలచొక్కా నవీన్ పై ఫైర్ అయిన బిగ్ బాస్ సోహెల్.. మరీ 0.45 రేటింగ్ ఏంటంటూ?

బిగ్ బాస్ సోహెల్ తాజాగా బూట్ కట్ బాలరాజు సినిమా( Bootcut Balaraju ) గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో నెట్టింట తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.

ఈ వీడియో విషయంలో కొంతమంది సోహెల్ ను సపోర్ట్ చేస్తే మరి కొందరు మాత్రం సోహెల్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

సోహెల్( Sohel ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పే విధానంలో తప్పు ఉండవచ్చు కానీ నా కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కదేమో అనే భయంతో నేను ఆ కామెంట్లు చేశానని సోహెల్ తెలిపారు.నేను ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో కష్టం ఉందని ఆయన కామెంట్లు చేశారు.

థియేటర్ లో సినిమా చూసి అభిప్రాయాన్ని పంచుకుంటే బాగుంటుందని సోహెల్ వెల్లడించారు.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్( Ambajipeta Marriage Band ) తర్వాత బూట్ కట్ బాలరాజుకే ప్రాధాన్యత ఉందని ఆయన అన్నారు.ప్రొఫెషనల్ రివ్యూ రైటర్లను నేను కామెంట్ చేయనని సోహెల్ అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ప్రాజెక్ట్స్ అనేవి పోవని సోహెల్ కామెంట్లు చేశారు.

Advertisement

నాకు తెలియకుండానే కొన్నిసార్లు నా బిహేవియర్ వల్ల నష్టపోతున్నానని సోహెల్ వెల్లడించారు.బూట్ కట్ బాలరాజు మంచి కంటెంట్ మూవీ అని పూలచొక్కా నవీన్( Poolachokka Naveen ) ఈ సినిమాలో తెలంగాణ భాషను క్రింజ్ చేశారని కామెంట్ చేశాడని సోహెల్ చెప్పుకొచ్చారు.

తెలంగాణలో హైదరాబాద్ తెలంగాణ వేరని గోదావరిఖని తెలంగాణ వేరు అని ఆయన తెలిపారు.ఈ విషయం పూలచొక్కా నవీన్ కు తెలియదని సోహెల్ కామెంట్లు చేశారు.

టమోటాలు ఇస్తాను అని నవీన్ చెబుతాడని టమోటాలు అమ్ముకునే ముఖం అంటూ నవీన్ పై సోహెల్ ఫైర్ అయ్యారు.0.45 రేటింగ్ అంటూ నవీన్ సినిమాను తీసిపడేశాడని ఆయన పేర్కొన్నారు.డెలివరీ బిడ్డను చంపేసినట్టు సినిమాను చంపేస్తున్నారని ఆయన కామెంట్లు చేశారు.

మంచికి మంచి చెడుకు చెడులా ఉండాలని లేకపోతే తొక్కేస్తారని సోహెల్ చెప్పుకొచ్చారు.తప్పు చేసిన వాళ్లను మాత్రమే నేను ప్రస్తావిస్తానని ఆయన తెలిపారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి3, సోమవారం 2025
Advertisement

తాజా వార్తలు