కొత్త కారు కొన్న బిగ్ బాస్ బ్యూటీ.... అంత కాస్టలీ కార్ అవసరమా అంటూ....

2016 సంవత్సరంలో ప్రముఖ తమిళ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయిన స్టార్ విజయ్ ఛానల్ లో ప్రసారమయ్యే "పాగల్ నిలైయావు" అనే ధారావాహిక ద్వారా బుల్లితెర పరిశ్రమకి నటిగా పరిచయం అయిన యంగ్ బ్యూటీ "శివాని నారాయన్" గురించి సినీ ప్రేక్షకులకు దాదాపుగా తెలిసే ఉంటుంది.

అయితే ఈ అమ్మడు ఇప్పటి వరకు దారావాహికలలో మాత్రమే నటించినప్పటికీ సినిమా ఇండస్ట్రీలో మాత్రం పెద్దగా రాణించలేక పోయింది దీనికి తోడు పలు చిత్రాలలో చిన్న చితక పాత్రలలో నటించినప్పటికీ అవికూడా పెద్దగా వర్కౌట్ కాక పోవడంతో అవకాశాలను దక్కించుకోలేకపోయింది.

కానీ ఇటీవలే తమిళ ప్రముఖ రియాల్టీ గేమ్ షో బిగ్ బాస్ నాలుగవ సీజన్లో కంటెస్టెంట్ గా పాల్గొని సినీ విమర్శకుల కళ్ళల్లో పడింది.దీంతో ప్రస్తుతం ఈ అమ్మడికి అవకాశాలు బాగానే క్యూ కడుతున్నట్లు సమాచారం.

దీంతో ప్రస్తుతం ఈ అమ్మడు పలు షోలు, ఈవెంట్లలో నటిస్తూ బిజీబిజీగా గడుపుతోంది.కాగా ఇటీవలే ఈ అమ్మడు బీఎండబ్ల్యూ ఆటో మొబైల్ సంస్థకి చెందిన 7 సీరిస్ కారుని కొనుగోలు చేసింది.

అంతేకాకుండా ఈ కార్ కి "బీస్ట్" అని పేరు కూడా పెట్టింది.అయితే ఈ కారు ధర సుమారు ఒక కోటి యాభై లక్షల రూపాయలకు పైగా ఉన్నట్లు సమాచారం.

Advertisement

దీంతో కొందరు అభిమానులు మరియు నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇంకొందరైతే ఏకంగా ఇప్పటివరకు శివాని నారాయన్ సినిమాల్లో హీరోయిన్ గా నటించలేదు.

కానీ ఇంత డబ్బు వెచ్చించి కారు ఎలా కొనుగోలుచేసిందంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం తమిళంలో శివాని నారాయన్ పలు ధారావాహికలలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది.

అంతేకాకుండా తమిళ ప్రముఖ హీరో విక్రమ్ హీరోగా నటిస్తున్న "విక్రమ్" అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు