Sri Satya Revanth : బిగ్ బాస్ హౌస్ లో టికెట్ టు ఫినాలే టాస్క్.. శ్రీ సత్యకు చుక్కలు చూపించిన రేవంత్?

తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 అప్పుడే చూస్తుండగానే ముగింపు దశకు చేరుకుంది.21 మంది కంటెస్టెంట్ లతో గ్రాండ్ గా మొదలైన బిగ్ బాస్ షోలో ప్రస్తుతం 8 మంది మాత్రమే మిగిలారు.

ఇది ఇలా ఉంటే తాజాగా 13 వారంలో భాగంగా నామినేషన్స్ ప్రక్రియ రచ్చ రచ్చ సాగింది.

కాగా ఈ వారం ఎక్కువ మంది రేవంత్ నే నామినేట్ చేశారు.ఇది ఇలా ఉంటే తాజాగా బిగ్ బాస్ హౌస్ లో టికెట్ టు ఫినాలే టాస్క్ ని ఇచ్చాడు బిగ్ బాస్.

ఈ టాస్క్ లో గెలిచిన వాళ్ళు ఎలిమినేట్ అవకుండా నేరుగా ఫైనల్‌ కు చేరుకుంటారు అని తెలిపాడు బిగ్ బాస్.టికెట్ టు ఫినాలే టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులకి స్నో మెన్ టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌.

టాస్క్ లో భాగంగా స్నో మెన్ రూపొందించేందుకు అవసరమైన ముక్కలు పై నుంచి విసిరేస్తూ ఉండగా వాటిని చేజిక్కించుకోవాలి.ఎవరైతే ముందుగా స్నోమెన్‌ని రెడీ చేస్తారు వారు విజేతగా నిలుస్తారు.

Advertisement

ఆ టాస్క్‌కి రేవంత్‌ సంచాలక్‌గా వ్యవహరించాడు. స్నో మెన్ పార్ట్స్ దక్కించుకోవడానికి ఇంటి సభ్యులు బాగానే కష్టపడ్డారు.

సత్య తీసుకున్న స్నో మెన్ పార్ట్ విరిగిపోవడంతో దాన్ని అతికించి పెట్టింది.అలా చేస్తే కౌంట్ రాదని రేవంత్ చెప్పినా కూడా వినకుండా అతికించినట్టు ఏమైనా తెలుస్తుందా ఏంటి కౌంట్ చేయకపోతే అది నీ ఇష్టం అని సత్య అంటూ అసహనం వ్యక్తం చేసింది.

అంతేకాకుండా తను సంపాధించిన స్నో మెన్‌ చేయి వేరే వాళ్లకి ఇచ్చేందుకు సిద్ధపడింది.

అప్పుడు శ్రీ సత్య చేయి ఎవరికైనా కావాలా అడగగా తనకి కావాలి అంటూ ఫైమా అడుగుతుంది.అప్పుడు సంచాలక్ గా ఉన్న రేవంత్ ఇచ్చుకోవడాలు లేవని అడ్డుపడినప్పటికీ శ్రీ సత్య వినకుండా ఎవరికైనా ఇస్తా అని సత్య మొండిగా అనేసరికి ఇచ్చుకోవడాలు లేవని రేవంత్ సీరియస్ గా అయ్యాడు.మరి ఈ టాస్క్‌లో ఎవరు గెలిచి టికెట్‌ టు ఫినాలే అందుకుంటారో చూడాలి మరి.కాగా బిగ్ బాస్ షో ముగింపు దశకు చేరుకుంటుండడంతో కంటెస్టెంట్ లతో పాటు ప్రేక్షకులకు కూడా టెన్షన్ మొదలయ్యింది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు