30 రోజుల్లో ఆ ట్వి్స్టే వేరట!

టాలీవుడ్‌లో యాంకర్ నుండి హీరోలుగా మారిన వారు చాలా మంది ఉన్నారు.

ఒక్క సినిమా సక్సెస్ అయినా వీరు హీరోలుగా తమ సత్తా చాటడానికి రెడీగా ఉంటారు.

కాగా తాజాగా యాంకర్ నుండి హీరోగా మారిన ప్రదీప్ మాచిరాజు తన తాజా చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ను రిలీజ్‌కు రెడీ చేశాడు.మార్చి 31న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది.

ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది.ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచాయి.

అయితే ఈ సినిమాలో ఓ పెద్ద ట్విస్టు ఉంటుందని చిత్ర యూనిట్ అంటోంది.ఈ సినిమా గతజన్మ ప్రేమ కాన్సెప్ట్‌తో తెరకెక్కిందని, ఇందులో ప్రదీప్ డ్యుయెల్ రోల్ చేస్తున్నాడని తెలుస్తోంది.

Advertisement

మొత్తానికి ఈ సినిమాతో ప్రదీప్ సక్సెస్ కొట్టడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.కాగా ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించగా మున్నా డైరెక్ట్ చేస్తున్నాడు.

నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...
Advertisement

తాజా వార్తలు