మొదట సినిమాకి ఒకరు.. సీక్వెల్ కి మరొకరు..ఇప్పుడు ఇదే స్ట్రాటజీ..!

ప్రతి సినిమాకి డైరెక్టర్ కి కానీ లేదా నిర్మాతకు ఏదో ఒక విజన్ ఉంటుంది వారు అదే దృష్టిలో పెట్టుకొని సినిమాను తీస్తారు అందుకే ఒక సినిమాని పూర్తిగా నిర్మించిన తర్వాత దానికి సీక్వెల్ కి వచ్చేసరికి ఏదో ఒక అంశంలో ఏదో ఒక తేడా జరుగుతుంది.

అంటే మొదట సినిమాలో ఉన్న వారు ఎవరో ఒకరు రెండవ సినిమాలో ఉండకపోవచ్చు.

లేదా మొదటి చిత్రాన్ని నిర్మించిన వారు సీక్వెల్ ని నిర్మించే అవకాశాలు లేకపోవచ్చు.అలాంటి కొన్ని మార్పులు చేర్పులు జరిగిన ఆ సీక్వెల్స్ ఏంటి అనే విషయాలను ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

గీత గోవిందం సినిమా( Geetha Govindam ) మొదటి భాగాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అర్జున్( Allu Arjun ) నిర్మించాడు.ప్రస్తుతం అదే క్యాస్ట్ అండ్ క్రూ తో ఈ సినిమాకి రెండవ భాగాన్ని కూడా నిర్మిస్తున్నారు కానీ ఈ చిత్రానికి నిర్మాత మారిపోయారు.ప్రస్తుతం సీక్వెల్ ని దిల్ రాజు( Dil Raju ) తెరకెక్కించే పనిలో ఉన్నారు.

ఇక చంద్రముఖి సినిమా( Chandramukhi ) విషయానికొస్తే మొదటి పార్ట్ లో రజనీకాంత్( Rajinikanth ) హీరోగా నటించిన వచ్చేసరికి ఆ పాత్ర చేయడానికి రజినీకాంత్ ఒప్పుకోకపోవడంతో రాఘవ లారెన్స్ తో( Raghava Lawrence ) దర్శకుడు కానిచ్చేసాడు.కానీ రెండవ పార్ట్ పూర్తిగా నిరాశనే మిగిల్చింది.

Advertisement

ఇక ఓదెల రైల్వే స్టేషన్( Odela Railway Station ) సినిమాలో హీరోయిన్ గా మొదటి పార్ట్ విషయానికి వచ్చేసరికి హెబ్బా పటేల్ నటించింది.ప్రస్తుతం దానికి సంబంధించిన రెండో పార్ట్ షూటింగ్ కూడా మొదలైంది.ఇందులో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక మనందరికీ ఎంతో ఇష్టమైన సినిమా డిజె టిల్లు.( DJ Tillu ) ఈ చిత్రానికి మొదటి పార్ట్ విమల్ కృష్ణ అనే డైరెక్టర్ దర్శకత్వం చేపట్టగా ఇంత క్లాసిక్ సినిమాకి ఈ రెండవ పార్ట్ షూట్ చేయడం ఇష్టం లేకపోవడంతో మల్లిక్ రామ్ అనే మరో వ్యక్తితో షూటింగ్ చేయించారు అది కూడా మంచి విజయాన్ని అందుకుంది కేవలం డైరెక్టర్ మాత్రమే కాదు.

ఈ సినిమాకి హీరోయిన్ కూడా మారిపోయింది.

మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?
Advertisement

తాజా వార్తలు