చాలా లేట్ వయసులో హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన స్టార్స్ వీరే !

మామూలుగా సినిమా ఇండస్ట్రీకి హీరోలుగా ఎంట్రీ ఇవ్వాలంటే 17 లేదా 18 ఏళ్ల నుంచే వారి కసురత్తులు మొదలవుతాయి.తమను తాము మేకోవర్ చేసుకొని ఈ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలని తహతహలాడుతూ ఉంటారు.20 దాటగానే కచ్చితంగా హీరోలు అయిపోవాలనే కసితో ఉంటారు.అందుకే చాలామంది హీరోలు 24, 25 ఏళ్ల లోపే హీరోలుగా గుర్తించబడతారు.

 Heros Who Came Into Industry In Late Age Vijay Sethupathi Sai Dharam Tej Mokshag-TeluguStop.com

ఎంతో కొంత స్టార్ డం కూడా సంపాదిస్తారు.కానీ మనం ఇప్పుడు చెప్పుకోబోయే హీరోలంతా పాతికేళ్ల తర్వాతే హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు కొంతమంది అయితే 30 ఏళ్ల తర్వాత కూడా హీరోలు అయిన వారు ఉన్నారు.

మరి వారెవరు అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Telugu Actors Age, Breathe, Age Heroes, Mokshagna, Nandamurihari, Pillanuvvu, Sa

ఉదాహరణకు విజయ్ సేతుపతినే( Vijay Sethupathi ) తీసుకోండి ఆయన నటనకు వంక పెట్టే అవకాశం ఉండదు.విజయ్ కి ఎంత టాలెంట్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు.ఆయన ప్రాపర్ హీరో అవడానికి దాదాపు 35 ఏళ్ల వయసు వరకు ఎదురు చూసారట.

కొన్ని రోజుల్లోనే ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మారిపోయారు.ఇప్పుడు విలన్ గా ఇండియా మొత్తం ఆయనొక ఫేమస్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు.

ఇక మన టాలీవుడ్ విషయానికొస్తే సాయి ధరం తేజ్( Sai Dharam Tej ) కూడా పిల్ల నువ్వు లేని జీవితం అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.అప్పటికి ఆయన వయసు 27 ఏళ్ళు.

Telugu Actors Age, Breathe, Age Heroes, Mokshagna, Nandamurihari, Pillanuvvu, Sa

ప్రస్తుతం బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ( Mokshagna ) కి 30 ఏళ్ల వయసు.ఆయన హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం అయిందట.మరి ఈ మధ్యకాలంలో ఇంత లేటుగా ఇండస్ట్రీకి వచ్చిన హీరో మరెవరూ లేరు.ఇక నందమూరి హరికృష్ణ( Nandamuri Hari Krishna ) సైతం చాలా లేటుగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు ఆయన 40 ఏళ్ల పై పడ్డ తర్వాత హీరో అయ్యారు.

అలాగే నందమూరి తారక రామారావు గారి పెద్ద కొడుకు కుమారుడు అయిన చైతన్య కృష్ణ( Chaitanya Krishna ) సైతం 47 ఏళ్ల వయసులో బ్రీత్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube