బిగ్‌బాస్‌ 8లో ఏకంగా 12 వైల్డ్ కార్డు ఎంట్రీలు.. ఇక మామూలుగా ఉండదు..!

బిగ్‌బాస్‌ ఎనిమిదవ సీజన్( Bigg Boss 8 ) లిమిట్‌లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ ట్యాగ్‌లైన్‌తో సెప్టెంబర్ 1వ తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే.

ఈ బిగ్గెస్ట్ రియాల్టీ షోకు ఈసారి కూడా నాగార్జున( Nagarjuna ) హోస్టింగ్ చేస్తున్నాడు.

ఈ షో స్టార్ట్ అయి దాదాపు 25 రోజులు అవుతుంది.ఈ 25 రోజుల్లో ఈ షోలో ఇంతకుముందు ఎన్నడూ చూడని వింతలు, విచిత్రాలు కనిపించాయి.

ఇంతకుముందు సీజన్లలో ఇండివిడ్యువల్‌గా కంటెస్టెంట్లు వచ్చారు కానీ ఈసారి జంటలుగా కంటెస్టెంట్లు అడుగుపెట్టారు.ఫస్ట్ రోజే నో కెప్టెన్, నో ఇమ్యూనిటీ, నో రేషన్, నో ఫిక్స్‌డ్ క్యాష్ ప్రైజ్‌ అంటూ షాక్ ఇచ్చారు.

కెప్టెన్సీకి బదులు చీఫ్స్ అనే కొత్త అథారిటీ తీసుకొచ్చారు.కావాలనుకుంటే హౌస్ మేట్స్ లెక్కలేనంత మనీ ఎర్న్ చేసుకోవచ్చు అని కూడా బంపరాఫర్ ఇచ్చారు.

Advertisement

ఈసారి టాస్కులు, గేమ్స్ ద్వారా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు.ఇలా సంపాదించిన మనీని "పే మనీ" అని అంటున్నారు.ఒక కంటెస్టెంట్ పర్ఫామెన్స్ బాగుంటే కూడా మనీ పెరుగుతుంది.మూడు వారాలకే రూ.11 లక్షల దాకా పే మనీ పెరిగింది.అన్ని వారాల తర్వాత ఈ మనీ ఎంతవరకు పెరుగుతుంది, దానిని ఎలా పంచుతారు అనేది ఇంకా తెలియ రాలేదు.

ఒకవేళ కంటెస్టెంట్లు బాగా ఆడక పోతే మనీ అనేది పోతుంది.సో, మొత్తం మీద ఈసారి బిగ్ బాస్ కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ గా ఉందని చెప్పుకోవచ్చు.

బెడ్ రూమ్ అలాట్మెంట్ విషయంలో కూడా డిఫరెంట్ ప్రివిలేజర్స్ కల్పించారు.ఇలా మొత్తం కొత్త కొత్త కాన్సెప్ట్‌లతో, ట్విస్టులతో ఈ సీజన్ ద్వారా ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతి అనేది లభిస్తోంది.

అయితే ఈ నేపథ్యంలోనే బిగ్‌బాస్ 8కి సంబంధించి మరొక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.

నిజ్జర్ హత్య : ఆధారాలపై చేతులెత్తేసిన ట్రూడో .. భారత్‌దే విజయమన్న కెనడియన్ జర్నలిస్ట్
ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచంటే ? 

సాధారణంగా ప్రతి బిగ్‌బాస్ సీజన్‌లో వైల్డ్ కార్డు ఎంట్రీ( Wild Card Entry ) ద్వారా ఒకరు లేదా ఇద్దరు కంటెస్టెంట్లను హౌస్ లోకి తీసుకొస్తారు.కానీ ఈసారి ఎవరి ఊహలకు అందని విధంగా ఏకంగా 12 మందిని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి తీసుకురాపోతున్నామని బిగ్ బాస్ ప్రకటించాడు.రీసెంట్ ప్రోమో ద్వారా ఈ ట్విస్ట్ తెలిసింది.

Advertisement

ప్రోమోలో "బిగ్ బాస్ ఇంట్లో ఒక పెద్ద భూకంపం రాబోతోంది.బిగ్‌బాస్ చరిత్రలో ఒకటి కాదు, రెండు కాదు, 5 కాదు, ఏకంగా 12 వైల్డ్ కార్డు ఎంట్రీలు రాబోతున్నాయి.

వీళ్ళు రావడానికి రెండు వారాల సమయం మాత్రమే ఉంది.వాళ్ళని ఆపడానికి కంటెస్టెంట్లందరికీ ఛాన్స్ ఇస్తున్నాం.

అదేంటంటే మీరు హౌస్ లో పెట్టే ఒక్కొక్క టాస్క్ గెలవడం ద్వారా ఒక్కొక్క వైల్డ్ కార్డు ఎంట్రీని అడ్డుకోవచ్చు.మొత్తం 12 టాస్కులు ఉంటాయి, ఎన్ని టాస్కులలో కంటెస్టెంట్స్‌ ఫెయిల్ అయితే అంతమంది వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారు.

" అని బిగ్ బాస్ తెలిపాడు.

దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ ట్విస్ట్ విన్నాక ఆడియన్స్ అవాక్కవుతున్నారు.కొత్తవాళ్లు హౌస్ లోకి ఎంట్రీ ఇస్తే ఇప్పుడు ఉన్నవారు బయటకు పోయే ప్రమాదం ఉండొచ్చు.

వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా జబర్దస్త్ అవినాష్,( Jabardasth Avinash ) హరి తేజ,( Hariteja ) రోహిణి, రీతూ చౌదరి, జ్యోతి రాయ్‌, అంజలి పవన్ బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టవచ్చని ప్రచారం జరుగుతోంది.మరి నెక్స్ట్ టూ వీక్స్ లో ఏం 12 టాస్కులు ఎలా ఉండనున్నాయి, కంటెస్టెంట్స్ వారిని రానివ్వకుండా ఎంత ట్రై చేయగలరు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

తాజా వార్తలు