Amitabh Bachchan : బిగ్ బీని అప్పుల్లోకి నెట్టేసిన ఆ కంపెనీ.. సింగిల్ ఆఫర్‌తో మళ్లీ ఎలా నిలబడగలిగాడంటే..

టీవీ  షోలు ( TV shows )అంటే అసభ్య పదజాలం వాడకం, డబుల్ మీనింగ్ డైలాగులు, సర్కస్ గంతులు, పాటలను కూని చేసే మ్యూజిక్ షోలు తెలుగు వారికి గుర్తుకు వస్తాయి.కానీ హిందీలో టీవీ షో అంటే ఒకే ఒక షో గుర్తుకువస్తుంది.

23 ఏళ్లుగా దిగ్విజయంగా నడుస్తున్న ఆ టీవీ షోలోని ప్రతి ఎపిసోడ్‌ని లక్షల మంది తప్పకుండా చూస్తారంటే అతిశయోక్తి కాదు.అది మారేదో కాదు జనరల్ నాలెడ్జి పెంచుతూ ఎంతోమంది జీవిత కథలను తెలియజేసే కౌన్ బనేగా కరోడ్‌పతి.

Big B Cant Change With Out It

ఈ షో 15 సీజన్లను రీసెంట్ గానే పూర్తి చేసుకుంది.ఈ సీజన్ లాస్ట్ ఎపిసోడ్‌లో హోస్ట్ అమితాబ్ బచ్చన్( Amitabh Bachchan ) కంటతడి పెట్టుకున్నాడు.ఆయనకు ఇప్పుడు 81 సంవత్సరాలు.23 ఏళ్లుగా ఈ గేమ్ చేంజింగ్ గేమ్ షోకి పోస్ట్ గా ఉంటే వస్తున్నాడు 15వ సీజన్‌తో గుడ్ బై చెబుతూ ఆయన ఏడ్చేసాడు.నిజానికి కేబీసీ( KBC ) అంటేనే అమితాబ్‌ బచ్చన్.

ఆయన ఎంతోమందిని చూశాడు.చిన్న బస్తీలో బతికే వారి నుంచి, రిటైర్డ్ ఉద్యోగులు, ధనిక భవనాల్లో నివసించే వారి వరకు ఎంతోమందికి ప్రశ్నలు వేస్తూ వారి కష్టాలను, జీవితాలను తెలుసుకుంటూ గడిపారు.

Advertisement
Big B Cant Change With Out It-Amitabh Bachchan : బిగ్ బీని అ�

మొదటగా హోస్ట్‌గా ఎలా వ్యవహరించారో చివరి వరకు అదే గాంభీర్యం చూపిస్తూ వచ్చారు.

Big B Cant Change With Out It

తెలుగులో నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి వంటి వారు ఇలాంటి షో నడపడానికి ప్రయత్నించారు.కానీ పెద్దగా సక్సెస్ కాలేకపోయారు.చిన్న హీరోలు కూడా బుల్లితెర షోలలో కనిపించడానికి నామోషీగా భావించే కాలంలో బడా హీరో అయి ఉండి కూడా బిగ్ బీ ఈ క్విజ్ షోలో చేయడానికి ఒప్పుకున్నారు.

నిజానికి ఆ సమయంలో "అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ (ఏబీసీ)" ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ వల్ల అమితాబ్‌ బచ్చన్ బాగా నష్టపోయి అప్పుల్లో కూరుకు పోయాడు.ఆరోగ్యం కూడా సరిగా ఉండేది కాదు.

భవిష్యత్తు అంధకారంలో ఉన్న సమయంలో టీవీ షో నుంచి ఆఫర్ వచ్చింది.అది చేయడానికి బిగ్ బి ఒప్పుకున్నాడు.

'రుద్ర' గా ప్రభాస్ కొత్త పోస్టర్ వైరల్!
కూలీ కోసం బుట్ట బొమ్మ... కళ్ళు చెదిరే రేంజిలో రెమ్యూనరేషన్?

జీవితంలో అతడు తీసుకున్న సరైన నిర్ణయాలలో అదీ ఒకటి.ఏబీసీ అతడిని పాతాళంలోకి తొక్కితే కేబీసీ ఆకాశానికి ఎత్తేసింది.

Advertisement

నార్త్ లో ప్రతి ఇంటికి తెలిసిన వాడు అమితాబ్‌ బచ్చన్.కేవలం అతడి ముందు కూర్చొని కాసేపు మాట్లాడడానికి దశాబ్దాలుగా కేబీసీ షోలో పాల్గొనే ఛాన్స్ కోసం ప్రయత్నం చేసేవారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

అంతగా ప్రేక్షకుల మనసుల్లో ఈ స్టార్ హీరో ముద్ర వేయగలిగాడు.బుల్లితెర షో ద్వారా అంత పాపులారిటీని దక్కించుకున్న నటుడు కూడా ఎవరూ లేరు.

తాజా వార్తలు