ఇండోనేషియాలో అమెరికా రాయబారిగా భారత సంతతి దౌత్యవేత్త .. బైడెన్ ఆదేశాలు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్( Joe Biden ) మరో భారత సంతతి మహిళకు కీలక బాధ్యతలు అప్పగించారు.

ఇండోనేషియాలో అమెరికా రాయబారిగా భారత సంతతికి చెందిన మాజీ స్టేట్‌ డిపార్ట్‌మెంట్ అధికారి కమలా షిరిన్ లఖ్‌దీర్‌ను( Kamala Shirin Lakhdeer ) ఎంపిక చేశారు.

ఫారిన్ సర్వీస్ ఆఫీసర్‌గా కమల.దాదాపు 30 ఏళ్ల పాటు డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్‌లో పలు హోదాల్లో పనిచేశారు.2017 నుంచి 2021 వరకు మలేషియాలో యూఎస్ అంబాసిడర్‌గా ఆమె పనిచేశారు.అంతకుముందు రాజకీయ వ్యవహారాల అండర్ సెక్రటరీకి ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌గానూ.2009 నుంచి 2011 వరకు నార్త్ ఐర్లాండ్‌లోని యూఎస్ కాన్సుల్ జనరల్‌గానూ కమల సేవలందించారు.

1991లో ఫారిన్ సర్వీస్‌లో చేరిన లఖ్‌దీర్.సౌదీ అరేబియాలోని యూఎస్ ఎంబసీలో పనిచేశారు.తర్వాత ఇండోనేషియాతో అమెరికా సంబంధాల్లో అత్యంత కీలకమైన మారిటైమ్ ఆగ్నేయాసియా వ్యవహారాల కార్యాలయానికి డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించారు.

కెరీర్ ప్రారంభంలో ఆమె తూర్పు ఆసియా అండ్ పసిఫిక్ వ్యవహారాల బ్యూరోలో తైవాన్ కో ఆర్డినేషన్ స్టాఫ్‌గా డిప్యూటీ కో ఆర్డినేటర్‌గా పనిచేశారు.తర్వాత చైనా, ఇండోనేషియా, సౌదీ అరేబియాల్లో పలు హోదాల్లో విధులు నిర్వర్తించారు.

Advertisement

భారతీయ తండ్రి, అమెరికన్ తల్లికి జన్మించిన కమలా లఖ్‌దీర్.హార్వర్డ్ కాలేజీ ( Harvard College )నుంచి బీఏ, నేషనల్ వార్ కాలేజ్ నుంచి ఎంఎస్ పట్టా పొందారు.చైనీస్, బహాసా ఇండోనేషియా భాషల్లో ఆమె అనర్గళంగా మాట్లాడగలరు.

కనెక్టికట్‌లోని వెస్ట్‌పోర్ట్‌లో పెరిగిన లఖ్‌దీర్ తండ్రి 1940లలో బర్కిలీలోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో చేరేందుకు ముంబై నుంచి అమెరికాకు వలసవచ్చారు.నేషనల్ మ్యూజియం ఆఫ్ అమెరికన్ డిప్లొమసీలో ప్రచురించబడిన ఒక ఇంటర్వ్యూలో .లఖ్‌దీర్ తన తల్లిదండ్రుల అంతర్జాతీయ నేపథ్యం, విదేశాలలో కుటుంబ పర్యటనల కారణంగా తన అంతర్జాతీయ కెరీర్ చిన్నతనంలోనే ప్రారంభమైందని వెల్లడించారు.1986లో హార్వర్డ్ కళాశాల నుంచి పట్టభద్రురాలయ్యాక.రెండేళ్లపాటు చైనాలో టీచర్‌గా పనిచేశారు కమల.ఈ క్రమంలోనే దౌత్యవేత్తగా మారాలని లఖ్‌దీర్‌ నిర్ణయించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు