జర్నలిస్ట్ పై బిడెన్ ఆగ్రహం...ఒక్కసారిగా షాక్ అయిన మీడియా..ఇంతకీ ఏం జరిగింది...!!

అమెరికా అధ్యక్షుడు బిడెన్ తో మీడియా సమావేశం జరుగుతోంది.

మీడియా వారు అడుగుతున్న ప్రశ్నలకు బిడెన్ సమాధానాలు ఇస్తున్నారు, రష్యా అధ్యక్షుడు పుతిన్ తో బిడెన్ సమావేశం అయిన విషయంపై ప్రశ్నలు అడుగుతున్నారు సమాధానాలు చెప్పి బిడెన్ వెళ్తూ ఉన్న క్రమంలో ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బిడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎంతో సౌమ్యంగా ఉండే బిడెన్ కు ఫైర్ అవ్వడంతో అక్కడ ఉన్నవారందరూ షాక్ అయ్యారు.అసలు అక్కడ ఏం జరుగుతోందో అర్ధం కాలేదు, కొంపదీసి బిడెన్ మీదకు ట్రంప్ పూనాడా అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయట.

ఇంతకీ బిడెన్ కు అంత కోపం తెప్పించిన ప్రశ్న ఏంటంటే.రష్యా అధ్యక్షుడితో బిడెన్ సమావేశం జరిగిన విషయం తెలిసిందే ఆ తరువాత మీడియా సమావేశం కూడా జరిగింది.

ఈ సమావేశంలో పాల్గొన్న సిఎన్ఎన్ వైట్ హౌస్ కరస్పాండెంట్ కైట్లాన్ బిడెన్ ను ప్రశ్నలతో ముంచెత్తారు.మీ భేటీ చాలా బాగుంది, అయితే ఈ భేటీ తరువాత పుతిన్ అమెరికాపై తన తీరును మార్చుకుంటారని మీరు భావిస్తున్నారా, అసలు పుతిన్ మానవ హక్కుల ఉల్లంఘన , సైబర్ దాడుల పై పెదవి విప్పలేదని అలాంటప్పుడు ఇది నిర్మాణాత్మకమైన చర్చ అని ఎలా చెప్పగలరు అంటూ ఆమె ప్రశ్నించారు.

Advertisement

దాంతో కోపంతో ఊగిపోయిన బిడెన్ వెళ్ళిపోతూ ఆమె వైపుగా వచ్చారు.

పుతిన్ తీరు మారుతుందని నేను అనుకోవడం లేదు, నేను నమ్ముతున్నాను అని చెప్పానా, నేను ఏ విషయాన్ని నమ్మను, నేను చెప్పేది నిజం , మీకు అర్థం అయినా కాకపోయినా నేను చేసేది ఏమి లేదు అంటూ అసహనం వ్యక్తం చేశారు.నేను ఎప్పుడూ ఆలోచించేది అమెరికా భవిష్యత్తు, నా ప్రజల అభివృద్ధి అంతే అంటూ సమాధానం ఇచ్చారు.అయితే కోపంగా ఆమెతో మాట్లాడినందుకు బిడెన్ ఆమెకు క్షమాపణలు తెలిపారు.

బిడెన్ ఇప్పటి వరకూ ఇలా ఒకరిపై అందులోనూ మీడియా పై ఫైర్ అవ్వలేదని ఇదే మొదటి సారని ఈ ఘటన అందరిలో ఆశ్చర్యాన్ని నింపిందిని అంటోంది అమెరికా మీడియా.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు