భోళా శంకర్ గట్టిగా కొట్టాల్సిందే..!

మెగా స్టార్ చిరంజీవి( Chiranjeevi ) మెగా మూవీ భోళా శంకర్ ఆగష్టు 11న రిలీజ్ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే.

అయితే ముందు చిరుకి పోటీగా బాలీవుడ్ నుంచి రణ్ బీర్ కపూర్ యానిమల్.

తెలుగు యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ( Sidhu jonnalagadda ) నటిస్తున్న టిల్లు స్క్వేర్ సినిమాలు పోటీకి వస్తాయని అనుకున్నా ఆ తర్వాత రెండు సినిమాలు మెగా ఫైట్ నుంచి తప్పుకున్నాయి.టిల్లు స్క్వేర్ సెప్టెంబర్ రిలీజ్ ప్లాన్ చేయగా యానిమల్ ఏకంగా డిసెంబర్ కి వాయిదా పడింది.

సో చిరు ఒక్కడే సోలోగా వస్తున్నాడని తెలుస్తుంది.

Bhola Shankar Chiranjeevi Mehar Ramesh Movie , Mehar Ramesh Movie , Chiranjeevi

ఈ ఏడాది ఆల్రెడీ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య( Waltheru Veeraya )గా వచ్చి హిట్ అందుకున్న చిరంజీవి భోళా శంకర్ తో కూడా ఆ రేంజ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.భోళా శంకర్ సినిమా మెగా మార్క్ ఎంటర్టైనర్ గా వస్తుందని తెలుస్తుంది.ముఖ్యంగా దశాబ్ధ కాలం తర్వాత డైరెక్షన్ ఛాన్స్ అందుకున్న మెహర్ రమేష్ ఈసారి హిట్ టార్గెట్ తో రంగంలోకి దిగుతున్నాడు.

Advertisement
Bhola Shankar Chiranjeevi Mehar Ramesh Movie , Mehar Ramesh Movie , Chiranjeevi

భోళా శంకర్ హిట్ పడితే మాత్రం మెహర్ రమేష్ మళ్లీ వరుస సినిమాలు చేసే అవకాశం ఉంది.భోళా శంకర్ సినిమాలో తమన్నా, కీర్తి సురేష్ ఫీమేల్ లీడ్స్ గా నటిస్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023
Advertisement

తాజా వార్తలు