ఘర్జించిన భీమ్ ఫర్ రామ రాజు! యుట్యూబ్ లో రికార్డుల మోత  

Bheem For Ramaraju Trending In You Tube Record Ram Charan - Telugu Bheem For Ramaraju Trending In You Tube, Bollywood, Kollywood, Pan India Movie, Ram Charan, Rrr Movie, Tollywood

భీమ్ ఫర్ రామరాజు… ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది.రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీం మెగా హీరోకి బర్త్ డే ట్రీట్ గా దీనిని రామరాజు పాత్ర పరిచయం చేస్తూ టీజర్ రిలీజ్ చేశారు.

 Bheem For Ramaraju Trending In You Tube Record Ram Charan

భీమ్ ఫర్ రామరాజు పేరుతో రిలీజ్ చేసిన ఈ టీజర్ ఇప్పుడు యుట్యూబ్ ని షేక్ చేస్తుంది.యుట్యూబ్ లో హిందీ టీజర్ నెంబర్ వన్ ట్రెండింగ్ లో ఉంది.

ఇక తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో రిలీజ్ చేసిన ఈ టీజర్ ని వీక్షించే వారి సంఖ్య అన్ని భాషలలో కలిపి 12 మిలియన్స్ దాటిపోయింది అంటే ఆర్ఆర్ఆర్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఘర్జించిన భీమ్ ఫర్ రామ రాజు యుట్యూబ్ లో రికార్డుల మోత-Movie-Telugu Tollywood Photo Image

ఇక ఒక్క మలయాళం తప్ప మిగిలిన నాలుగు భాషలలో ఈ టీజర్ లో రామరాజు పాత్రని పరిచయం చేస్తున్న కొమరాం భీమ్ గా ఎన్టీఆర్ వాయిస్ వినిపించింది.

నాలుగు భాషలలో ఒకటే ఇంటెన్సన్ తో ఎన్టీఆర్ క్యారెక్టర్ ని నేరేట్ చేసే విధానం నెటిజన్లుని ఫిదా చేస్తుంది.మొదటి సారి హిందీలో ఎన్టీఆర్ వాయిస్ వింటున్న నార్త్ ప్రేక్షకుల అయితే విజువల్ ట్రీట్మెంట్ కంటే ఎన్టీఆర్ పవర్ ఫుల్ వాయిస్ కి ఫిదా అయిపోయారని చెప్పాలి.

హిందీలో ఈ టీజర్ ఏకంగా నాలుగు మిలియన్స్ క్రాస్ చేసింది.తెలుగు తర్వాత అత్యధికంగా వీక్షించింది హిందీలోనే కావడం విశేషం.దీనిని బట్టి బాలీవుడ్ లో కూడా ఈ సినిమా మీద ఎన్ని అంచనాలు ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.ఒక బాలీవుడ్ సినిమా ట్రైలర్ కి రాని విధంగా ఈ భీమ్ ఫర్ రామరాజు టీజర్ కి వ్యూస్ రావడం విశేషం.

ఒకే ఒక్క టీజర్ తో సినిమా అంచనాలని జక్కన్న ఎక్కడికో తీసుకుపోయాడు.ఈ నేపధ్యంలో కొమరాం భీమ్ పాత్ర ఎలా ఉంటుందో అనేది ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bheem For Ramaraju Trending In You Tube Related Telugu News,Photos/Pics,Images..