తెలంగాణ ఫలితాలపై బెట్టింగులు.. పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బెట్టింగులు జోరుగా సాగుతున్నాయని తెలుస్తోంది.ప్రధాన అభ్యర్థులతో పాటు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న దానిపై బెట్టింగులు వేస్తున్నారు.

హంగ్ ఫలితాలు వస్తాయంటూ బెట్టింగులు సాగుతున్నాయని సమాచారం.ఈ క్రమంలోనే గజ్వేల్, కామారెడ్డి, సిద్దిపేటపై భారీగా బెట్టింగులు వేస్తున్నారు బెట్టింగ్ రాయుళ్లు.

రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్, బండి సంజయ్, కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లారెడ్డి సహా పలువురు నేతలు పోటీ చేసిన స్థానాలపై బెట్టింగులు కొనసాగుతున్నాయి.రూ.లక్ష పెడితే రూ.2 లక్షలు ఇచ్చే విధంగా బెట్టింగులను బుకీలు నిర్వహిస్తుండగా ఎగ్జిట్ పోల్స్ తరువాత మరింత పెరిగాయని సమాచారం.అయితే నెలక్రితం నుంచి ఏపీలోని పలు ప్రాంతాల్లో బెట్టింగుల ప్రక్రియ నిర్వహిస్తున్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలో బెట్టింగులపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది.

Advertisement
హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి? వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?

తాజా వార్తలు