ముఖం తెల్ల‌గా, మృదువుగా మారాలా..త‌మ‌ల‌పాకు ట్రై చేస్తే స‌రి!

ముఖం తెల్ల‌గా, మృదువుగా ఉండాల‌ని అంద‌రూ కోరుకుంటారు.అందు కోసం ర‌క‌ర‌కాల ప్రొడెక్ట్స్ కూడా వాడుతుంటారు.

బ్యూటీ పార్ల‌ర్స్‌కు వెళ్తుతుంటారు.కాస్త డ‌బ్బున్న వారైతే ట్రీట్‌మెంట్స్ కూడా చేయించుకుంటారు.

కానీ, ఎలాంటి ఖ‌ర్చు లేకుండా న్యాచుర‌ల్‌గా కూడా ముఖాన్ని మృదువుగా, తెల్ల‌గా మెరిపించుకోవ‌చ్చు.అందుకు ముఖ్యంగా త‌మ‌ల‌పాకు గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

అవును.పూజకు, శుభకార్యాలకు, కిళ్ళీ లకు విరి విరిగా ఉప‌యోగించే త‌మ‌ల‌పాకులు చ‌ర్మ సౌంద‌ర్యాన్ని పెంచ‌డంలోనూ ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

Advertisement

మ‌రి వీటిని ఎలా యూజ్ చేయాలి అన్న‌ది ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఫ్రెష్‌గా ఉంటే త‌మ‌ల‌పాకుల‌ను తీసుకుని మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.ఈ పేస్ట్‌లో కొబ్బ‌రి పాలు యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు ప‌ట్టించి.

ప‌ది లేదా ఇర‌వై నిమిషాల అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా మూడు రోజుల‌కు ఒక సారి చేస్తే.

చ‌ర్మ ఛాయ పెర‌గ‌డంతో పాటు మృదువుగా కూడా మారుతుంది.అలాగే త‌మ‌ల‌పాకుల‌ను మెత్త‌గా నూరి ర‌సం తీసుకోవాలి.

ఏంటి భయ్యా.. స్వీట్ షాప్ కు స్వీట్స్ కొనడానికి వచ్చాయా ఏంటి ఎలుకలు(వీడియో)
జగన్ తప్పు తెలుసుకున్నారా ? ప్రక్షాళన కు సిద్ధమా ? 

ఇప్పుడు ఈ ర‌సంలో గులాబీ రేకుల పొడి లేదా రోజ్ వాట‌ర్ వేసి బాగా క‌లుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి పూసి.

Advertisement

డ్రై అయిన త‌ర్వాత కూల్ వాట‌ర్‌లో క్లీన్ చేసుకోవాలి.ఇలా రెగ్యుల‌ర్‌గా చేస్తే ముఖం తెల్ల‌గా, మృదువుగా మ‌రియు కాంతి వంతంగా మారుతుంది.

ఇక త‌మ‌ల‌పాకుల నుంచి ర‌సం తీసుకుని లైట్‌గా వేడి చేయాలి.ఇప్పుడు ఈ ర‌సంలో స్వ‌చ్ఛ‌మైన తేనె క‌లిపి.

ముఖానికి, మెడ‌కు అప్లై చేయాలి.పావు గంట పాటు ఆర‌నిచ్చి.

ఆ త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో వాష్ చేసుకోవాలి.ఇలా రెండు రోజుల‌కు ఒక సారి చేసినా.

మంచి ఫ‌లితం ఉంటుంది.

తాజా వార్తలు