బెస్ట్ హెయిర్ గ్రోత్ టానిక్ ఇది.. వారానికి ఒక్కసారి వాడితే బోలెడు లాభాలు!

ఆహారపు అలవాటు, పోషకాలు కొరత, పెరిగిన కాలుష్యం, ఒత్తిడి వంటి కారణాల వ‌ల్ల ఎప్పుడూ ఏదో ఒక జుట్టు సమస్య వేధిస్తూనే ఉంటుంది.

జుట్టు అధికంగా రాలిపోవడం, హెయిర్ గ్రోత్ లేకపోవడం, చుండ్రు, జుట్టు ముక్కలవడం, చిట్లడం, డ్రై అవ్వడం.

ఇలా ఏదో ఒక సమస్య ఇబ్బంది పెడుతూనే ఉంటుంది.అయితే ఈ సమస్యలన్నిటికీ చెక్ పెట్టే అద్భుతమైన హెయిర్ టానిక్( Hair tonic ) ఒకటి ఉంది.

దీన్ని వారానికి ఒకసారి వాడితే బోలెడు లాభాలు పొందవచ్చు.మరి ఇంతకీ ఆ హెయిర్ టానిక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అవ్వగానే రెండు టేబుల్ స్పూన్లు అల్లం ముక్కలు,( Ginger slices ) వన్ టేబుల్ స్పూన్ లవంగాలు, రెండు టేబుల్ స్పూన్లు మెంతులు వేసి ఉడికించాలి.దాదాపు పది నిమిషాల పాటు ఉడికించి ఆపై వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

Advertisement

ఈ వాటర్ పూర్తిగా చల్లారిన తర్వాత అరకప్పు ఫ్రెష్ ఉల్లిపాయ రసం, రెండు స్పూన్లు ఆముదం, ( Castor oil )వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ ( Vitamin E oil )వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.తద్వారా మన హెయిర్ టానిక్ సిద్ధం అవుతుంది.

ఈ టానిక్ ను ఒక స్ప్రే బాటిల్ లో నింపుకొని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండు సార్లు స్ప్రే చేసుకోవాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ టానిక్ ను వాడితే హెయిర్ ఫాల్ సమస్య ( Hair fall problem )చాలా వేగంగా కంట్రోల్ అవుతుంది.

హెయిర్ గ్రోత్ చక్కగా పెరుగుతుంది.ఊడిన జుట్టు మళ్ళీ మొలుస్తుంది.

కొద్ది రోజుల్లోనే మీ కురులు ఒత్తుగా పొడుగ్గా మారతాయి.అలాగే ఇందులో ఆముదం, విటమిన్ ఈ ఆయిల్ ను వాడటం వల్ల జుట్టు డ్రై అవ్వకుండా హైడ్రేటెడ్ గా ఉంటుంది.

కమల్ హాసన్ భారతీయుడు 3 తో మరోసారి నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడా..?
కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?

మరియు జుట్టు చిట్లడం, విరగడం వంటి సమస్యలు దూరమవుతాయి.కురులు హెల్తీగా స్ట్రాంగ్ గా మారతాయి.

Advertisement

తాజా వార్తలు