చర్మం మీద అద్భుతంగా పనిచేసే శనగపిండి ఫేస్ పాక్స్

శనగపిండిని ముఖ సౌందర్యం కోసం మన అమ్మమ్మల కాలం నుండి ఉపయోగిస్తున్నారు.శనగపిండి అన్ని చర్మ తత్వాలకు సరిపోతుంది.

ఎటువంటి రాష్ లు రావు.చర్మ సమస్యలను తగ్గించి చర్మం మృదువుగా మారటానికి చాలా బాగా సహాయపడుతుంది.

Besan Face Packs For Skin Problems , Skin Problems, Besan, Olive Oil, Aloe Vera

ఇప్పుడు చెప్పే శనగపిండి ఫేస్ ప్యాక్ లను ఉపయోగిస్తే అద్భుతమైన పలితాలు పొందవచ్చు.ఆ పాక్స్ ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.

ఒక స్పూన్ శనగపిండిలో అరస్పూన్ ఆలివ్ ఆయిల్,అరస్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి 20 నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.ఒక స్పూన్ శనగపిండిలో రెండు స్పూన్ల గ్రీన్ టీ వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి 15 నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మొటిమల సమస్య నుండి బయట పడవచ్చు.

Advertisement

ఒక స్పూన్ శనగపిండిలో అరస్పూన్ అలోవెరా జెల్ కలిపి ముఖానికి పట్టించి 20 నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మంలో పొడి తగ్గి తేమగా ఉంటుంది.ఒక స్పూన్ శనగపిండిలో ఒక స్పూన్ రోజ్ వాటర్ కలిపి ముఖానికి పట్టించి 20 నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది.

ఈ ప్యాక్ ని వారంలో రెండు సార్లు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.ఒక స్పూన్ శనగపిండిలో రెండు స్పూన్ల తెల్ల చామంతి టీని కలిపి ముఖానికి పట్టించి 20 నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం మీద పేరుకున్న జిడ్డు,మురికి తొలగిపోతుంది.

Advertisement

తాజా వార్తలు