100 రోజులు నిద్రపోతే లక్ష జీతం.. ఎక్కడంటే?

కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల దేశంలో కోట్లాది మంది ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారు.

దేశంలోని చాలా ప్రైవేట్ సంస్థలు ఉద్యోగులకు సగం లేదా అంతకంటే కొంచెం ఎక్కువ వేతనాలు మాత్రమే చెల్లిస్తున్నాయి.

అయితే కరోనా విపత్కర పరిస్థితుల్లో ఇంట్లో ఉండే డబ్బులు సంపాదించుకునే అవకాశాన్ని వేక్ ఫిట్ సంస్థ కల్పిస్తోంది.గతంలో రోజుకు 9 గంటల చొప్పున 100 రోజులు నిద్రపోయిన వారికి లక్ష చెల్లించిన ఈ సంస్థ తాజాగా అలాంటి ఆఫర్ నే మన ముందుకు తీసుకొచ్చింది.అయితే ఈ ఉద్యోగం చేయడం సులభమే అయినా ఎంపిక కావడం మాత్రం అంత తేలిక కాదు.2019లో 1,70,000 మంది ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోగా కేవలం 23 మందిని మాత్రమే అదృష్టం వరించింది.తాజాగా కంపెనీ 2021లో ఈ ఉద్యోగం చేసే వారి కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది.

నిద్రకు ప్రాధాన్యత ఇచ్చేవాళ్లు, నిద్రపోవడంలో ఎక్స్ పర్ట్స్ అయిన వాళ్లు మాత్రమే ఈ జాబ్ కు అర్హులవుతారు.అయితే చాలామందికి ఈ కంపెనీ ఎందుకు ఇలాంటి వింత ప్రయోగాలు చేస్తోంది అనే అనుమానం కలగవచ్చు.

నిద్ర పట్ల ప్రజల్లో ధోరణిని మార్చాలనే ఉద్దేశంతో ఈ కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.మనలో చాలామంది రోజుకు కనీసం ఆరు గంటలు కూడా నిద్రపోవడం లేదని.

Advertisement

నిద్రలేమి వల్ల అనేక ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారని తెలిపింది.అయితే ఎంపికై రోజుకు 9 గంటలు నిద్రపోకపోతే మాత్రం లక్ష రూపాయల జీతం పొందలేరు.

అవసరమా భయ్యా.. కొత్త జంట ఫస్ట్ నైట్ వీడియో అంటూ..(వీడియో)
Advertisement

తాజా వార్తలు