ఓం అనే మంత్రాన్ని ప్రతిరోజూ ప‌ఠించ‌డం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా?

మన హిందూ ఆచార వ్యవహారాల ప్రకారం ఓం అనే పదాన్ని పవిత్రతకు చిహ్నంగా భావిస్తాము.

సాక్షాత్తు ఓం అనే మంత్రాన్ని దైవ సమానంగా భావించి ప్రతిరోజు ఈ మంత్రాన్ని పఠిస్తూ ఉంటారు.

చాలామంది పూజ అనంతరం ఈ మంత్రాన్ని చదవుతూ ఉంటారు.అయితే ఓం అనే మంత్రాన్ని ప్రతిరోజు చదవటంవల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

ఓం అనే మంత్రాన్ని ప్రతిరోజూ ప‌ఠించ‌డం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి చక్రాలు ఉత్తేజితం అవ్వడం వల్ల మన శరీరం ఎంతో చురుకుగా ఉండటమే కాకుండా ఏకాగ్రత పెరుగుతుంది.అలాగే మన శరీరంలో శక్తి సామర్థ్యాలు కూడా పెరుగుతాయి.

అదేవిధంగా మనలో ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావాన్ని కూడా తొలగిస్తుంది.ఈ మంత్రాన్ని ప్రతి రోజు చదవటం వల్ల మన శరీరంలో ఏ విధమైనటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఎంతో ఆనందంగా ఉండగలుగుతారు.

Advertisement

నిటారుగా కూర్చుని ఈ మంత్రాన్ని పఠించండం చేత వెన్నెముక సమస్యలు కూడా తగ్గుతాయి.ఓం అనే నాదం మన శరీరంలోని అన్ని నాడుల కదలికకు దోహదపడుతుంది.ఈ క్రమంలోనే మనలో ఉన్నటువంటి ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత కలుగుతుంది.

మానసిక వ్యాధితో బాధపడే వారు ప్రతి రోజు ఈ మంత్రాన్ని చదవటం వల్ల తొందరగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.ఈ మంత్రంతో మానసిక ప్రశాంతత కలుగుతుంది కనుక మనం ఏ దేవాలయాలకు వెళ్లిన ధ్యానంలో ఉన్నప్పుడు కూడా ఓం అనే మంత్రాన్ని ఉచ్ఛరిస్తూ ధ్యానం చేయటంతో మనసు కి ప్రశాంతత కలుగుతుంది.

Advertisement
" autoplay>

తాజా వార్తలు