పెరుగుతో జుట్టు ఆరోగ్యం మెరుగు.‌. వారానికి ఒక్కసారి తలకి పట్టించారంటే మస్తు లాభాలు!

జుట్టు రాలడం, బలహీనమైన కురులు, చుండ్రు, జుట్టు చిట్లి పోవడం, విరగడం.ఇలా మనందరినీ ఏదో ఒక జుట్టు సమస్య వేధిస్తూనే ఉంటుంది.

వీటికి దూరంగా ఉండటం కోసం ఖరీదైన హెయిర్ ఆయిల్, షాంపూ, కండిషనర్ త‌దిత‌ర ఉత్పత్తులను వాడుతుంటారు.అయితే వాటి వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది అన్నది పక్కన పెడితే మనం వంటింట్లో ఉండే కొన్ని కొన్ని పదార్థాలు మాత్రం జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా అద్భుతంగా సహాయపడతాయి.

ఈ జాబితాలో పెరుగు కూడా ఒకటి.పెరుగులో ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి 2, విటమిన్ బి 12 తో సహా ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.

రోగ నిరోధక శక్తి( Immunity )ని పెంచడంలో, ఎముకలను బలపరచడంలో, శరీర బ‌రువు నిర్వాహణలో,ఆరోగ్యమైన జీర్ణక్రియ( Digestion)ను ప్రోత్సహించడంలో పెరుగు చక్కగా తోడ్పడుతుంది.అలాగే కేశ సంరక్షణకు సైతం పెరుగు మద్దతు ఇస్తుంది.

Advertisement

అందుకోసం ముందుగా ఒక బౌల్ లో నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు గడ్డ పెరుగు తీసుకోవాలి.ఇప్పుడు ఈ పెరుగును స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.

ఆ తర్వాత షవర్ క్యాప్ ధరించాలి.గంట లేదా గంటన్నర అనంతరం తేలికపాటి షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒకసారి ఇలా పెరుగు తలకు పట్టించడం వల్ల అదిరిపోయే లాభాలు మీ సొంతం అవుతాయి.

పెరుగులో ఉండే బయోటిన్, జింక్ వంటి పోషకాలు జుట్టును మూలాల నుండి బలోపేతం చేయడంలో సహాయపడతాయి.అలాగే పెరుగు ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.తలకు పెరుగును పట్టించడం వల్ల జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరగడం స్టార్ట్ అవుతుంది.

జుట్టు రాలడం కంట్రోల్ అవుతుంది.బలహీనమైన కురులు బలంగా మారుతాయి.

దేవర మూవీ ఐదో రోజు కలెక్షన్లు లెక్కలు ఇదే.. ఎన్టీఆర్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారుగా!
ట్యాక్స్ ట్యాక్స్ పేయర్ల కు ప్రభుత్వం ప్రత్యేక హక్కులు కల్పించాల్సిందే.. కొరటాల శివ డిమాండ్..?

అంతేకాదు జుట్టుకు పెరుగు సహజమైన యాంటీ డాండ్రఫ్ ఫైటర్‌ గా పని చేస్తుంది.పెరుగులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, లాక్టిక్ యాసిడ్ మరియు ప్రోబయోటిక్స్ స్కాల్ప్‌ ను ఆరోగ్యంగా మారుస్తాయి.చుండ్రును వదిలించడంలో హెల్ప్ చేస్తాయి.

Advertisement

ఇక పెరుగు జుట్టుకు సహజమైన కండీషనర్ లేదా మాయిశ్చరైజర్‌గా కూడా పని చేస్తుంది.వారానికి ఒకసారి తలకు పెరుగు రాయడం వల్ల డ్రై హెయిర్( Dry hair ) సమస్య దూరం అవుతుంది.

జుట్టు విరగడం, చిట్ల‌డం వంటివి తగ్గుతాయి.

తాజా వార్తలు