మీకు తెలిసిన అనాథలుంటే ఈ పథకం గురించి ఖచ్చితంగా చెప్పండి... భరోసా ఇచ్చినవారు అవుతారు!

ఈ సువిశాల ప్రపంచంలో ఒక్కొక్కరి జీవితం ఒక్కోలా ఉంటుంది.

కొందరు పుట్టుకతోనే గోల్డెన్ స్పూన్ ( Golden Spoon )తో పుడుతూ సర్వ సుఖాలు అనుభవిస్తూ వుంటారు.

మరికొంతమంది ఎందుకు పుట్టామో తెలియక అనాధలుగా ఈ జీవన చక్రంలో కొట్టుమిట్టాడుతూ బతుకుని కొనసాగిస్తూ వుంటారు.ఈ స్వార్ధపూరిత ప్రపంచంలో అలాంటివారు గోడు ఎవరికీ అవసరం లేదు.

మనం పెట్టకపోయినా పెట్టే ఇల్లు ఉంటే అలాంటివారికి చూపించడంలో తప్పేముంది.ఏమాత్రం మాట సాయం చేస్తే తరిగిపోయేదేముంది?.

ఇపుడు అనాథ పిల్లలు( Orphan children ) మిగతా పిల్లల్లాగే చదువుకుని వృద్ధిలోకి రావాలనే ఆలోచనతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిషన్ వాత్సల్య ( Mission Vatsalya )పేరుతో చక్కని పథకాన్ని అమలు చేస్తున్నాయి.దీనికింద అనాథ బాలలకు 18 ఏళ్ల వయసు వచ్చేవరకు నెలకు 4 వేల రూపాయల భృతి అందిస్తున్నారు.దీనికయ్యే ఖర్చును కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో భరించడం విశేషం.అయితే ఈ విషయం చాలామందికి తెలియదు.

Advertisement

ఇక తాజాగా ఏపీలో ఈ పథకం కోసం అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.ఈ నెల 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఛైర్మన్‌ కేసలి అప్పారావు( Kesali Apparao ) తెలిపారు.

అంగన్వాడీ సిబ్బంది, టీచర్లు, వలంటీర్లు తమ ప్రాంతాల్లోని అనాథలతో దరఖాస్తు చేయించాలని కోరింది రాష్ట్ర ప్రభుత్వం.అంతేకాకుండా విడాకులు తీసుకున్న తల్లీ పిల్లలతోపాటు తల్లిదండ్రులిద్దర్నీ కోల్పోయి బంధువుల ఇళ్లలో ఉంటున్న అనాథ పిల్లలు కూడా దీనికి అర్హులే.హెచ్ఐవీ వంటి నయంకాని జబ్బులతో బాధపడే తల్లిదండ్రుల పిల్లలు, పెంచలేనంత పేదరికంలో నలిగే తల్లిదండ్రుల పిల్లలు, యాచకుల పిల్లలు, వీధిబాలలు, బాలకార్మికులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.నిబంధనలను బట్టి పల్లెల్లో వార్షికాదాయం రూ.72 వేలు, పట్టణాల్లో రూ.96 వేలలోపు ఉండాలి.ఏప్రిల్ 15వ తేదీలోగా జిల్లామహిళాభివృద్ధి,శి‎శు సంక్షేమ శాఖకార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించాలి.

Advertisement

తాజా వార్తలు