యూఏఈలో పొట్టి ప్రపంచ కప్‌ - 2021..?!

ఈసారి భారత్ లో జరగాల్సిన టీ-20 ప్రపంచ కప్‌ శ్రీలంక లేదా యూఏఈ లో పెట్టేందుకు బీసీసీఐ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.

అయితే చివరగా యూఏఈ ని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో టీ20 ప్రపంచ కప్‌ ను అక్టోబర్‌ 17వ తేది నుంచి యూఏఈలో ప్రారంభం కానుంది.అలాగే నవంబర్ 14వ తేదిన ఫైనల్ నిర్వహించనున్నారు.

ఇందుకోసం బీసీసీఐ షెడ్యూల్‌ ను తయారు చేసింది.అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీకి తన నిర్ణయాన్ని తెలియజేనున్నట్లు బీసీసీఐ అధికారులు తెలిపినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఈ టోర్నమెంట్ లో మొత్తంగా చూస్తే 16 దేశాలు పాల్గొననున్నట్లు సమాచారం.యూఏఈలో మొత్తం 3 వేదికలు ఉన్నాయి.

Advertisement

అవి అబుదాబి, షార్జా, దుబాయ్ లో ఉన్నటువంటి టీ20 పోటీలు నిర్వహిస్తున్నారు.అలాగే టీ20 ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌ మ్యాచ్‌ లకు ఒమన్ ఆతిథ్యం ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది.

భారతదేశంలోనే టీ20 ప్రపంచ కప్‌ ను నిర్వహించాలని మొదటగా అనుకున్నారు.అయితే బీసీసీఐకి రెండు సమస్యలు వచ్చాయి.

భారత ప్రభుత్వం నుంచి ఏ రకమైన టాక్స్‌ మినహాయింపు కూడా లభించలేదు.అలాగే కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఐపీఎల్‌ ను ప్రతిసారి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

దీనివలన మళ్లీ విదేశీ ఆటగాళ్లు భారత్ కు వచ్చేందుకు ఒప్పుకుంటారని అనుమానాలు ఉన్నాయి.బీసీసీఐ ఫైనల్‌ గా యూఏఈని ఖరారు చేసినట్లు తెలిపింది.

త్రివిక్రమ్ కథ చెప్తుంటే పవన్ కల్యాణ్ నిద్ర పోతే, మహేష్ బాబు లేచి వెల్లిపోయారట
సోదరి, బావ కలిసి చేతబడి చేశారంటూ పోలీస్ కంప్లైంట్.. అధికారులు షాక్..??

అయితే 2016లో టీ-20 ప్రపంచ కప్‌ పెట్టినప్పుడు కూడా ప్రభుత్వం నుంచి కూడా పన్ను మినహాయింపులనేవి లభించనే లేదు.దీంతో యూఏఈకి తరలించడం మంచిదని అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.మరోవైపు చూస్తే కొత్త డెల్టా వేరియంట్ భారత్ లో రావడంతో ఎలాంటి రిస్క్‌ తీసుకోదలుచుకోలేనట్లుగా తెలుస్తోంది.

Advertisement

ఐపీఎల్ ముగిసిన తర్వాత టీ-20 ప్రపంచ కప్ జరిగే అవకాశం ఉంది.దీంతో ఆటగాళ్ల జర్నీకి ఇబ్బందులు ఉండవని బీసీసీఐ తెలుపుతోంది.

తాజా వార్తలు