ఉద్యోగులకు బీబీసీ టిక్‌టాక్ యాప్ వాడొద్దని వార్నింగ్... వివరాలు ఇవే!

టిక్‌టాక్ యాప్.( TikTok ) దీని గురించి తెలియనివారు దాదాపుగా వుండరు.

చైనా యాప్( China App ) వచ్చిన కొత్తలోనే రికార్డ్స్ క్రియేట్ చేసింది.ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల సంఖ్యలో డౌన్లోడ్స్ సంపాదించి టాప్ యాప్స్ లో ఒకటిగా అవతరించింది.

దీని ద్వారా ఎంతోమంది ఓవర్ నైట్ సెలిబ్రిటీలుగా మారిపోయారు.వారినే మనం టిక్‌టాక్ స్టార్లుగా పిలిచేవాళ్ళం.

అయితే దీనిద్వారా చైనా వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తోందన్న ఆరోపణలు నేపథ్యంలో ఈ యాప్ పైన పలు దేశాలు నిషేధం విధిస్తున్నాయి.ఇప్పటికే భారత్ సహా అమెరికా వంటి దేశాలు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాయి.

Advertisement

ఈ క్రమంలోనే బీబీసీ న్యూస్( BBC News ) తమ ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.ఉద్యోగులందరూ తమ ఫోన్లలోని టిక్ టాక్ యాప్ ని తొలగించాలని ఆదేశించింది.బిజినెస్ పర్పస్ లో వినియోగించాల్సి వస్తే తప్ప ఎవరూ ఆ యాప్ ని వాడొద్దని తేల్చి చెప్పింది.

ఈ సందర్భంగా కీలకమైన డేటాను చోరీ చేసే ప్రమాదముందని కూడా వారిని హెచ్చరించింది.ఉద్యోగులందరికీ మెసేజ్ ద్వారా ఈ విషయాన్ని తెలిపింది.చైనా అధికారులు ఈ యాప్స్ ద్వారా కీలకమైన సమాచారాన్ని దొంగిలిస్తున్నారన్న అనుమానాన్ని వ్యక్తం చేసింది.

అదేవిధంగా బ్రిటన్ కూడా ప్రభుత్వ డివైజులలో టిక్ టాక్ యాప్ ఉండొద్దని కఠినంగా ఆంక్షలు విధించింది.అంతకు ముందు ఐరోపా దేశాలతో సహా అమెరికా కూడా ఇదే నిర్ణయం తీసుకుంది.ఈ క్రమంలోనే ఈ యాప్ పైన నిషేధం విధిస్తూ కెనడా సంచలన నిర్ణయం తీసుకుంది.

ఇకపోతే చైనాలోని బైట్ డాన్స్ కు చెందిన టిక్ టాక్ పై ఇండియాలో ఎప్పటినుండో నిషేధం కొనసాగుతోంది.అదే విధంగా అగ్రరాజ్యంలోనూ టిక్ టాక్ పైన అసహనం వ్యక్తమవుతోంది.

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
వైరల్ వీడియో : మాజీ ప్రియుడి పెళ్లిలో ప్రియురాలు ఎంట్రీ.. చివరకు ఏం జరిగిందంటే?

ఈ మేరకు వైట్ హౌస్ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేయడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు