ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.అసెంబ్లీలోని మొదటి అంతస్తులో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.
ఈ క్రమంలో ముందుగా సీఎం జగన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అదేవిధంగా ఇప్పటివరకు 35 మంది ఎమ్మెల్యేలు ఓటును వేశారు.
మరోవైపు పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు అసెంబ్లీకి ర్యాలీగా వెళ్లనున్నారు.అయితే సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది.
అనంతరం సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది.