ఉద్యోగులకు బీబీసీ టిక్‌టాక్ యాప్ వాడొద్దని వార్నింగ్... వివరాలు ఇవే!

టిక్‌టాక్ యాప్…( TikTok ) దీని గురించి తెలియనివారు దాదాపుగా వుండరు.ఈ చైనా యాప్( China App ) వచ్చిన కొత్తలోనే రికార్డ్స్ క్రియేట్ చేసింది.

 Bbc Warns Its Employees Not To Use Tiktok App Details, Bbc News, Tiktok, Bbc Emp-TeluguStop.com

ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల సంఖ్యలో డౌన్లోడ్స్ సంపాదించి టాప్ యాప్స్ లో ఒకటిగా అవతరించింది.దీని ద్వారా ఎంతోమంది ఓవర్ నైట్ సెలిబ్రిటీలుగా మారిపోయారు.

వారినే మనం టిక్‌టాక్ స్టార్లుగా పిలిచేవాళ్ళం.అయితే దీనిద్వారా చైనా వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తోందన్న ఆరోపణలు నేపథ్యంలో ఈ యాప్ పైన పలు దేశాలు నిషేధం విధిస్తున్నాయి.

ఇప్పటికే భారత్ సహా అమెరికా వంటి దేశాలు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాయి.

ఈ క్రమంలోనే బీబీసీ న్యూస్( BBC News ) తమ ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.ఉద్యోగులందరూ తమ ఫోన్లలోని టిక్ టాక్ యాప్ ని తొలగించాలని ఆదేశించింది.బిజినెస్ పర్పస్ లో వినియోగించాల్సి వస్తే తప్ప ఎవరూ ఆ యాప్ ని వాడొద్దని తేల్చి చెప్పింది.

ఈ సందర్భంగా కీలకమైన డేటాను చోరీ చేసే ప్రమాదముందని కూడా వారిని హెచ్చరించింది.ఉద్యోగులందరికీ మెసేజ్ ద్వారా ఈ విషయాన్ని తెలిపింది.చైనా అధికారులు ఈ యాప్స్ ద్వారా కీలకమైన సమాచారాన్ని దొంగిలిస్తున్నారన్న అనుమానాన్ని వ్యక్తం చేసింది.

అదేవిధంగా బ్రిటన్ కూడా ప్రభుత్వ డివైజులలో టిక్ టాక్ యాప్ ఉండొద్దని కఠినంగా ఆంక్షలు విధించింది.అంతకు ముందు ఐరోపా దేశాలతో సహా అమెరికా కూడా ఇదే నిర్ణయం తీసుకుంది.ఈ క్రమంలోనే ఈ యాప్ పైన నిషేధం విధిస్తూ కెనడా సంచలన నిర్ణయం తీసుకుంది.

ఇకపోతే చైనాలోని బైట్ డాన్స్ కు చెందిన టిక్ టాక్ పై ఇండియాలో ఎప్పటినుండో నిషేధం కొనసాగుతోంది.అదే విధంగా అగ్రరాజ్యంలోనూ టిక్ టాక్ పైన అసహనం వ్యక్తమవుతోంది.

ఈ మేరకు వైట్ హౌస్ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేయడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube