బతుకమ్మ ఎఫెక్ట్‌ : కిలో చామంతి పూలు రూ.600

తెలంగాణలో నేడు పూల పండుగ బతుకమ్మ జరుగుతున్న విషయం తెల్సిందే.

బతుకమ్మ చివరి రోజు అవ్వడంతో పల్లె పట్టణాల్లోని ప్రతి ఒక్క ఆడపడుచు కూడా బతుకమ్మ సెలబ్రేషన్స్‌లో మునిగి పోయారు.

బతుకమ్మ ఉత్సవాల్లో ముఖ్యమైన పూలకు నేడు భారీగా ధర పెరిగింది.సాదారణ రోజుల్లో బంతి పూలు 60 నుండి 100 రూపాయల వరకు ఉంటుంది.

కాని నేడు 200 నుండి 250 వరకు కూడా బంతి పూల రేటు పలుకుతుంది.ఇక చామంతి పూలను పట్టుకునేట్లుగా కూడా లేదు.రూ.600 లకు కేజీ చామంతి పూలు అమ్ముతున్నట్లుగా తెలుస్తోంది.సాదారణ రోజుల్లో చామంతి పూలు 150 నుండి 200 రూపాయల వరకు ఉంటుంది.

కాని నేడు మాత్రం 600 రూపాయల వరకు రేటు పలుకుతున్న నేపథ్యంలో సామాన్యులు కొనుగోలు చేయలేని పరిస్థితి.నేటి సాయంత్రం వరకు మార్కెట్‌లో ఇదే రేటు కొనసాగుతుందని, రేపు యధావిధిగా 150 రూపాయలకు వచ్చేస్తుందని పూల మార్కెట్‌ యాజమాన్యాలు అంటున్నారు.

Advertisement

మార్కెట్‌లో చామంతి పూలకు కొరత ఏర్పడ్డ కారణంగా రేటు పెంచాల్సి వచ్చిందని, రేటు పెంచినా కూడా కొద్ది మొత్తంలో అయినా పూలను కొనుగోలు చేస్తున్నారట.పల్లెటూర్లలో పొలానికి వెళ్లి పూలను తెంచుకుని వస్తారు.

కాని సిటీల్లో ప్రతి ఒక్కరు పూలను కొనుగోలు చేయాల్సిందే.అందుకే ఇంత భారీ రేట్లు పలుకుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు