కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు..

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలకేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఆధ్వర్యంలో సోమవారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు.

విద్యార్థులు రంగురంగుల పువ్వులతో బతుకమ్మను పేర్చి పసుపుతో గౌరమ్మను చేసి బతుకమ్మ పాటలతో ఆడిపాడారు.

ఈ సందర్బంగా ప్రిన్సిపల్ హరినాథ్ రాజు మాట్లాడుతూ తెలంగాణ అంటేనే సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పెరు అని అన్నారు.తెలంగాణ అడపడుచులందరు ఘనంగా జరుపుకునే ఎంగిలిపూల బతుకమ్మ పండుగను పాఠశాలలో ఘనంగా నిర్వహించడం జరిగిందని అన్నారు.

చిన్నారులు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి పాటలు పాడుతూ కొలటలు వేస్తూ బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని అన్నారు.రుద్రంగి మండల ప్రజలకు మరియు కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ఎలిగేటి నరేష్, డైరెక్టర్లు తిపిరెడ్డి వేంకటరెడ్డి, ఎర్రం గంగనర్సయ్య, పడాల సురేష్ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement
మరుపురాని మహమనిషి ఎన్టీఆర్ - మోతె రాజిరెడ్డి

Latest Rajanna Sircilla News