ఏటీఎం లలో డబ్బులు లేవా....ఇక ఇప్పుడు ఆ సమస్య మళ్లీ రాదు

ఏటీఎం లలో డబ్బులు లేకుండా ఉండే ఘటనలు చాలానే చూసే ఉంటారు ప్రతి ఒక్కరూ.

ఒక ఏటీఎం లో డబ్బులు లేకపోతె వేరొక ఏటీఎం కు వెళ్లడం అక్కడ లేకపోతె మరో చోటికి ఇది సామాన్యుడి పరిస్థితి.

అయితే ఇప్పుడు అలా ఏటీఎం లలో డబ్బులు లేకపోతె ఆ బ్యాంకుల పై ఆర్బీఐ కొరడా ఝళిపించనుంది.బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు చెల్లించేటప్పుడు ఒక్క రోజు ఆలస్యమైనా బ్యాంకులు ఊరుకుంటాయా వడ్డీ వడ్డించేస్తాయి.

మరి సామాన్యుడి అందించే సర్వీసుల విషయం వారు ఆలస్యం చేసినా వారికీ ఎలాంటి ఫైన్ లు ఉండవు.కానీ ఇప్పుడు ఆ పరిస్థితులలో మార్పు రానుంది.

ఇక ఏటీఎం లో డబ్బులు లేకపోతె ఆ బ్యాంకు కు ఆర్బీఐ ఫైన్ విధించనున్నట్లు తాజాగా నిర్ణయం తీసుకుంది.ఏటీఎంలకు వెళ్లినప్పుడు అవి పని చెయ్యట్లేదనో, డబ్బులు లేవనో వాటి ముందు బోర్డులు వేలాడదీస్తుంటారు.

Advertisement

అయితే ఇక ఇప్పుడు అలాంటి బోర్డులు గనుక కనిపిస్తే ఫైన్ బాదుడే నట.3 గంటలకు మించి ఆ బోర్డ్ ఉంటే, ఆ ఏటీఎం కేంద్రంపై ఆర్బీఐ చర్యలు తీసుకొని జరిమానా వేసి వెంటనే బ్యాంకుకి పంపిస్తుంది.అయితే ఈ ఫైన్ అన్ని ఏటీఎంలకూ ఒకే విధంగా కూడా ఉండదట.

ఏటీఎం ఉన్న ప్రదేశం, దానికి ఉన్న డిమాండ్, వచ్చే కస్టమర్లు ఇలా అన్నీ విషయాలను పరిగణలోకి తీసుకొని మరీ ఫైన్ వేయనున్నారు.ఇక ఇప్పుడు డబ్బులు లేవు,ఏటీఎం లు పనిచేయడం లేదంటూ బ్యాంకు చేతులు దులుపుకోవడానికి అవకాశం లేదు అన్నమాట.

Advertisement

తాజా వార్తలు