ఒకప్పుడు ప్యూన్.. ఇప్పుడు వేల రూ.కోట్లకు అధిపతి.. ఫెవికాల్ ఓనర్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఒకప్పుడు దీనస్థితిని అనుభవించి కెరీర్ పరంగా సక్సెస్ సాధించిన వ్యక్తుల సక్సెస్ వెనుక ఎన్నో కష్టాలు ఉంటాయి.

ఫెవికాల్, ఫెవిక్విక్ ఓనర్ బల్వంత్ పరేఖ్ ( Feviquik Owner Balwant Parekh )సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.

ఒకప్పుడు ప్యూన్ గా పని చేసిన బల్వంత్ ఇప్పుడు వందల సంఖ్యలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగారు.ఒకప్పుడు ఇంటి అద్దె కట్టడానికి కూడా బల్వంత్ ఇబ్బంది పడ్డారు.

ప్రస్తుతం బల్వంత్ పరేఖ్ ఆస్తుల విలువ 88 వేల కోట్ల రూపాయలు కావడం గమనార్హం.ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనా బల్వంత్ మాత్రం వెనుకడుగు వేయలేదు.

ఫెవికాల్, ఫెవిక్విక్, ఎంసీఎల్ ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా బల్వంత్ ఈ స్థాయికి ఎదిగారు.పిడిలైట్ ఇండస్ట్రీస్( PIDLIGHT INDUSTRIES ) ఈ ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి.

Advertisement

ఇష్టం లేకుండానే లా చదివిన బల్వంత్ పెళ్లి తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఆదాయం లేకపోగా అప్పుల భారం వల్ల అతనికి సరికొత్త సమస్యలు ఎదురయ్యాయి.ప్యూన్ పని నుంచి ఒక్కో మెట్టు ఎదిగిన బల్వంత్ సొంతంగా కంపెనీని స్థాపించి ఫెవికాల్ ఉత్పత్తులను తయారు చేశారు.గుజరాత్( Gujarath ) కు చెందిన బల్వంత్ ఫెవికాల్ సక్సెస్ తో కెరీర్ పరంగా వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే రాలేదు.

బల్వంత్ పరేఖ్ ఇంత సక్సెస్ అయినా సింపుల్ గా ఉండటానికి ఇష్టపడతారు.

ది ఫెవికాల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా( The Fevical Man of India ) పేరు తెచ్చుకున్న బల్వంత్ పరేఖ్ ఒక్కో మెట్టు పైకి ఎదిగి ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు.బల్వంత్ పరేఖ్ వయస్సు 88 సంవత్సరాల వయస్సులో మృతి చెందారు.నచ్చిన రంగంపై ఫోకస్ పెడితే సక్సెస్ దక్కుతుందని బల్వంత్ పరేఖ్ ప్రూవ్ చేశారు.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
వైరల్ వీడియో : సినిమా స్టైల్లో మహిళను రక్షించిన జాలర్లు..

బల్వంత్ పరేఖ్ టాలెంట్ తో ఎంతో కష్టపడి దేశంలోని సంపన్నుల్లో ఒకరిగా ఎదిగారు.

Advertisement

తాజా వార్తలు