పార్టీ మారడంపై స్పష్టత ఇచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డి..!!

గురువారం సీఎం జగన్ తో బాలినేని శ్రీనివాసరెడ్డి( Balineni Srinivasa Reddy ) భేటీ ముగిసింది.అనంతరం మీడియాతో మాట్లాడుతూ .

ఇళ్ల స్థలాలు, నియోజకవర్గ అభివృద్ధి గురించి ముఖ్యమంత్రితో చర్చించినట్లు తెలిపారు.తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలను గతంలోనే ఖండించారు.

ఇదే సమయంలో పార్టీ మారే అవకాశం ఉంటే ఇక్కడి దాక వచ్చేవాడిని కాదు కదా అని చెప్పుకొచ్చారు.తన నియోజకవర్గంలో భూ అక్రమణాల మీద కూడా ముఖ్యమంత్రి దగ్గర చర్చించడం జరిగింది.

ఇవన్నీ తెలుగుదేశం పార్టీ నాయకులు( TDP ) కావాలనే ప్రచారం చేశారు.జగన్ కోసం నాలుగు సంవత్సరాల మంత్రి పదవి వదులుకొని రాజకీయాలు చేసిన వాడిని.

Advertisement

సీఎం జగన్ దగ్గరికి రావడానికి నాకు ఎటువంటి అపాయింట్మెంట్ అవసరం లేదు అని తెలిపారు.ఇదే సమయంలో ఎప్పుడైనా రావచ్చు అని సీఎం జగన్( CM Jagan ) కూడా చెప్పినట్లు స్పష్టం చేశారు.నేను చాలా సెన్సిటివ్.

మీడియాను అడ్డం పెట్టుకొని నాపై చేసిన దుష్ప్రచారం మొత్తం సీఎం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.నేను ఎవరి జోలికి వెళ్ళను.

నా జోలికి వస్తే వదిలే ప్రసక్తి లేదు.జిల్లాలో ఉన్న రాజకీయ ఇబ్బందులు మొత్తం సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.

ఈ క్రమంలో ముఖ్యమంత్రిగారే చూసుకుంటానని మాట ఇచ్చారు.ఇదే సమయంలో త్వరలో సీఎం జగన్ వచ్చి ఇళ్ళ పట్టాలు పంపిణీ చేస్తారని బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు.

1980లో అమెరికాకి వలస వెళ్లిన భారతీయ మహిళ.. ఇప్పుడు ఎలా ఉందంటే..
Advertisement

తాజా వార్తలు