Balakrishna Venkatesh :ఒకే దారిలో పయనిస్తున్న బాలయ్య, వెంకటేశ్, నాని.. ముగ్గురిలో విజేతగా నిలిచేదేవరో?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో రానున్న కొద్ది రోజుల్లో అనగా రెండు మూడు నెలల్లో సినిమాల జాతర మొదలుకానుంది.

వరుసగా పాన్ ఇండియా సినిమాలు, స్టార్ హీరోల సినిమాలు విడుదల కానున్నాయి.

ప్రభాస్, రామ్ చరణ్, బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, నాని, వెంకటేష్ ఇలా చాలామంది స్టార్ హీరోల సినిమాలు వరుసగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.అయితే అందులో ముగ్గురు హీరోల గురించి ఎంతో ప్రత్యేకంగా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

ఆ ముగ్గురు మరెవరో కాదు బాలకృష్ణ- వెంకటేష్- నాని.ఈ ముగ్గురు హీరోలు తమ తర్వాత సినిమాల కోసం ఒకే కథను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.ఆ వివరాల్లోకి వెళితే.

ఈ ముగ్గురు హీరోలు వారి తర్వాత సినిమా కోసం కూతురు సెంటిమెంట్ ను ప్రధానంగా తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇక బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్‌ కేసరి( Bhagwant kesari ) ఈ సినిమాలో బాలయ్య తన కూతుర్ని కాపాడుకునే తండ్రిగా కనిపించునున్నారు.ఇందులో యంగ్ హీరోయిన్ శ్రీలీల, బాలకృష్ణ కూతురు పాత్రలో నటించింది.

Advertisement

ఈ సినిమాకు స్టార్ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.అయితే ఈ దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కానుంది.

అలాగే విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సైంధవ్‌ సినిమా( Saindhav )కు డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించారు.

ఈ యాక్షన్ సస్పెన్స్ సినిమాలో కూడా కూతురు సెంటిమెంట్ ప్రధానంగా కనిపించనుంది.ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు చూస్తే ఎంతో క్లియర్గా అర్థమవుతుంది.ఈ సినిమా ఈ సంవత్సరం చివరిలో డిసెంబర్ 22న ప్రేక్షకులు ముందుకు రానుంది.

అదేవిధంగా హీరో నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన్ హాయ్ నాన్న సినిమా( Hi Nana ) కూడా కూతురు సెంటిమెంట్ తో ప్ర‌ధానంగా రానుంది అన్న‌ ఈ విషయాన్ని మూవీ టైటిల్ లోనే చెప్పేశారు.ఇందులో మృణాల్‌ ఠాకూర్ హీరోయిన్గా నటించింది.

దంతాలపై పసుపు మరకలా.. ఈజీగా ఇలా వదిలించుకోండి..!
శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్!

ఈ సినిమా కూడా డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.మరి దాదాపు ఓకే క‌థ‌తో వస్తున్న ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా ప్రేక్షకులను బాగా మెప్పిస్తుందో చూడాలి మరి.

Advertisement

తాజా వార్తలు