టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని నందమూరి బాలకృష్ణ అభిమానులు కోరుకుంటున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే చిరంజీవి కొడుకు రామ్ చరణ్, నాగార్జున కొడుకులు నాగ చైతన్య, అఖిల్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి నటులుగా గుర్తింపు తెచ్చుకున్నారు.
మోక్షజ్ఞ ఎంట్రీ గురించి వార్తలు వస్తున్నా ఇప్పటివరకు ఆ వార్తల్లో ఏదీ నిజం కాలేదు.
తాజాగా నందమూరి జయకృష్ణ కుమారుడు కృష్ణచైతన్య వివాహం జరగగా ఈ వివాహానికి మోక్షజ్ఞ హాజరయ్యారు.
మోక్షజ్ఞ పెళ్లి వేడుకలో దిగిన ఒక ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.అయితే మోక్షజ్ఞ ఫిట్ నెస్ పై ఇప్పటికీ దృష్టి పెట్టలేదని ఫోటో చూస్తే అర్థమవుతోంది.
ప్రస్తుతం మోక్షజ్ఞ వయస్సు పాతికేళ్లు కాగా మోక్షజ్ఞ సినిమా ఎంట్రీకి మరో రెండు మూడేళ్లు పట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.బాలకృష్ణ త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని చెబుతున్నా మోక్షజ్ఞ బరువు తగ్గిన తరువాతే సినిమాల్లోకి ఎంట్రీ ఇప్పించాలని భావిస్తున్నారని సమాచారం.

నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణతో పాటు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు.తారకరత్న కూడా సినిమాలు చేస్తున్నా అతనికి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు.అయితే బాలకృష్ణ మాత్రం మోక్షజ్ఞ కోసం కథలు వింటున్నాడని పూరీ జగన్నాథ్ లేదా బోయపాటి శ్రీనులలో ఎవరో ఒకరు మోక్షజ్ఞ తొలి సినిమాకు దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది.
కరోనా మహమ్మారి విజృంభణ వల్ల ప్రేక్షకులు థియేటర్లలో సినిమాలు చూడటాని ఆసక్తి చూపడం లేదు.
కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొన్న తరువాతే బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞను గ్రాండ్ గా లాంఛ్ చేయనున్నారని తెలుస్తోంది.మోక్షజ్ఞ కోసం రచయిత సాయిమాధవ్ బుర్రా ఒక కథను సిద్ధం చేశారని ఆ కథతోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉండవచ్చని తెలుస్తోంది.