చంద్రబాబు ఆరోగ్యం విషయంలో సీఎం జగన్ పై బాలకృష్ణ సీరియస్ వ్యాఖ్యలు..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) ఆరోగ్యంతో జగన్ చెలగాటమాడుతున్నారని ఎమ్మెల్యే బాలకృష్ణ( MLA Balakrishna ) సీరియస్ వ్యాఖ్యలు చేశారు.శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.

అభివృద్ధిలో చంద్రబాబుని ఎదుర్కోలేక అక్రమ కేసులతో జైలు పాలు చేశారు.73 సంవత్సరాల వయసు కలిగిన పెద్దాయనపై ఈ రకమైన ఇబ్బందులు పెడతారా అని మండిపడ్డారు.ఫేక్ హెల్త్ రిపోర్టులతో మభ్య పెట్టాలని వైసీపీ భావిస్తోంది అంటూ ఆరోపణలు చేశారు.

స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్న చంద్రబాబుకి 34 రోజులుగా జైల్లో కనీస సౌకర్యాలు కల్పించలేదు.తక్షణమే చంద్రబాబు వైద్యానికి వ్యక్తిగత వైద్యులను అనుమతించాలి.సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్పించే వైద్యం అందించాలి.

Balakrishna Serious Comments On CM Jagan Regarding Chandrababu Health , Balakris

చంద్రబాబుకు ఏమైనా జరిగితే జగన్ దే బాధ్యత.అని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో డాక్టర్ల పేరుతో జైలు సూపరింటెండ్ హెల్త్ రిపోర్ట్ ఇవ్వటం పట్ల సీరియస్ అయ్యారు.సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజును ( MP Raghuramakrishnam Raju )శరీరకంగా హింసించి దొంగ రిపోర్టులు ఇచ్చినట్టే చంద్రబాబు విషయంలో చేస్తున్నారు అని విమర్శించారు.

Advertisement

నెల రోజుల్లో చంద్రబాబు 5 కేజీల బరువు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది.మరో రెండు కేజీలు బరువు తగ్గితే ఆ ప్రభావం కిడ్నీలపై పడే అవకాశం ఉంది.

విరిగిన ఎముకలు ఎక్సరేలో కనిపించకుండా మేనేజ్ కూడా చేసే రకం మీరు అని వైసీపీ పై విమర్శలు చేశారు.చంద్రబాబు ఆరోగ్యం పై ప్రజలలో ఎమోషన్స్ రాకుండా ఉండటం కోసం జగన్ రెడ్డి ఎంతకు దిగజారేందుకైనా సిద్ధంగా ఉన్నారు అని సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

జైల్లో పెట్టేసి మా ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే కుదరదు అంటూ బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చారు.

జిమ్ చేసేవాళ్లకు షాకింగ్ న్యూస్.. ఆ తప్పుచేసి 21 ఏళ్ల యువకుడు మృతి..
Advertisement

తాజా వార్తలు