తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటూ ఇండస్ట్రీలో ముందుకు దూసుకెళ్తున్నారు.అలాంటి వారిలో జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) ఒకడు 18 సంవత్సరాలకే హీరోగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పాటు చేసుకున్నాడు.
అనతి కాలంలోనే ఆయన స్టార్ డైరక్టర్ల తో సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఈయన చాలా సినిమాలు ఇండస్ట్రీలో విజయనందుకోవడం తోపాటు నందమూరి ఫ్యామిలీని బాలయ్య బాబు ( Balayya Babu )తర్వాత ముందుకు తీసుకెళ్లే ఒకే ఒక స్టార్ హీరోగా ఎన్టీఆర్ ఎదగడం జరిగింది.ఇక రీసెంట్ గా చంద్రబాబు నాయుడుని ( Chandrababu Naidu )స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో పెట్టిన విషయం మనకు తెలిసింది.చంద్రబాబు గారికి అందరూ మద్దతు గా మాట్లాడారు కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ విషయంలో అసలు ఇన్వాల్వ్ అవ్వట్లేదు అలాగే తన అరెస్ట్ కి నిరసనగా కనీసం ఒక ట్వీట్ కూడా చేయలేదు.
ఆయనని కలవడానికి జైలు దాకా కూడా వెళ్ళలేదు దాంతో నందమూరి అభిమానులు గానీ, టిడిపి కార్యకర్తలు కానీ ఎన్టీఆర్ మీద తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇదే క్రమంలో రాజీవ్ కనకాల( Rajeev Kanakala ) రీసెంట్ గా ఆయన కొడుకు కు సంబంధించిన సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఇక దాంట్లో ఎన్టీఆర్ చంద్ర బాబు అరెస్ట్ మీద స్పందించకపోవడానికి కారణం ఏంటి అని అడిగితే దానికి రాజీవ్ కనకాల సమాధానం ఇస్తు తారక్ సినిమా బిజీలో ఉండటం వల్ల స్పందించడం లేదేమో అంటూ ఎన్టీఆర్ ని కవర్ చేస్తూ మాట్లాడారు.దాంతో కొంతమంది టిడిపి అభిమానులు రాజీవ్ కనకాల ని ట్రోల్స్ కూడా చేస్తున్నారు.ఇక ఇలాంటి క్రమం లో రాజీవ్ కనకాల మీద కూడా చాలా మంది టిడిపి కార్య కర్తలు ఎన్టీయార్ ని బాగా కవర్ చేస్తున్నావ్ రాజీవ్ ఎంతైనా ఆయన ఫ్రెండ్స్ వి కదా అంటూ చాలా మంది యూత్ ఆయన కి కౌంటర్స్ వేస్తున్నారు.